AA20 ఆ కొత్త పార్టనర్ ఎవరండీ?

0

అల్లు అర్జున్ కెరీర్ ల్యాండ్ మార్క్ సినిమా ఏఏ 20 ఈ బుధవారం హైదరాబాద్ లో గ్రాండ్ గా ప్రారంభమైన సంగతి తెలిసిందే. సుకుమార్ ఈ చిత్రానికి దర్శకత్వం వహిస్తున్నారు. మైత్రి మూవీ మేకర్స్ సంస్థ నిర్మిస్తోంది. అయితే ప్రారంభోత్సవం సందర్భంగా రిలీజ్ చేసిన ప్రెస్ నోట్ లో ఓ కొత్త పేరు ప్రస్తుతం మీడియాలో హాట్ టాపిక్ గా మారింది. మైత్రి మూవీ మేకర్స్ తో ఆ కొత్త భాగస్వామి ఎవరు? ముత్తం శెట్టి మీడియా సంగతేమిటి? అంటూ ఆసక్తిగా మాట్లాడుకున్నారు.

మైత్రి సంస్థ నుంచి భాగస్వామి అయిన సీవీ మోహన్ వ్యక్తిగత కారణాలతో తప్పుకున్న సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఈ బ్యానర్ ని రవి-నవీన్ ఎర్నేని మిత్రద్వయం రన్ చేస్తున్నారు. మైత్రి అంటే ఒక బ్రాండ్. ఆరంగేట్రమే అగ్ర హీరోలతో సంచలన విజయాల్ని అందుకున్న ఈ బ్యానర్ అంటే మార్కెట్లో ఒక ప్రత్యేకమైన ఇమేజ్ ఉంది. ఈ సంస్థ నుంచి సీవీ మోహన్ వేరుపడడంపై అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగింది.

అయితే ఇప్పుడు ఆ స్థానాన్ని భర్తీ చేసేందుకు వేరొక భాగస్వామి వచ్చారా? అంటూ ఆసక్తిగా మాట్లాడుకుంటున్నారు. ఇంతకీ ఆ భాగస్వామి ముత్తం శెట్టి మీడియానా? అన్నది హాట్ టాపిక్. ముత్తం శెట్టి మీడియా అంటే ముత్తంశెట్టి కృష్ణారావుకు సంబంధించిన కంపెనీ. ఆయన జనసేన నాయకుడిగా సుపరిచితం. ప్రజారాజ్యంలోనూ ఆయన ఉన్నారు. అంతేకాదు ముత్తం శెట్టి .. స్టార్ హీరో అల్లు అర్జున్ కి చుట్టం. మేనమామ వరుస అవుతారు. బన్ని మాతృమూర్తి .. అల్లు అరవింద్ సతీమణి శ్రీమతి నిర్మల అల్లుకి స్వయానా సోదరుడు ముత్తంశెట్టి. అయితే ఈ బాండింగ్ గురించి బంధుమిత్రులకు.. మీడియా వర్గాలకు తప్ప బయటి వారికి అంతగా తెలియకపోవచ్చు. బన్ని – సుకుమార్ కాంబినేషన్ లో మైత్రి సంస్థ భారీ చిత్రం తీస్తోంది. అందుకే ముత్తంశెట్టి భాగస్వామ్యం ఆసక్తిని రేకెత్తిస్తోంది.




Please Read Disclaimer