బుర్రకథ..ఈవారంలో లేదు! – ఆది

0

రిలీజ్ ముంగిట డైలమా ఎవరికైనా బాధాకరమే. అలాంటి సన్నివేశాన్నే ఎదుర్కొంటోంది `బుర్రకథ` టీమ్. ఆది సాయికుమార్ కథానాయకుడిగా డైమండ్ రత్నబాబు దర్శకత్వంలో తెరకెక్కిన `బుర్రకథ` ఈ శుక్రవారం (28న) రిలీజ్ కావాల్సి ఉండగా .. సెన్సార్ పరమైన చిక్కుల వల్ల వాయిదా పడింది. అయితే ఒకరోజు ఆలస్యంగా రిలీజవుతుందని ఓ పోస్టర్.. అలా ఏం లేదు.. `కమింగ్ సూన్` అంటూ వేరొక పోస్టర్ వెబ్ లో దర్శనమీయడంతో కన్ఫ్యూజన్ నెలకొంది.

ఆ క్రమంలోనే నేటి మధ్యాహ్నమే దర్శకుడు డైమండ్ రత్నబాబు దీనిపై అధికారికంగా క్లారిటీనిచ్చారు. సెన్సార్ ఇబ్బందుల వల్లనే రిలీజ్ కావడం లేదు. ఆది అభిమానులకు సారీ చెబుతున్నా. ఈ రెండ్రోజుల్లో బుర్రకథ రిలీజ్ తేదీపై క్లారిటీ వస్తుందని రత్నబాబు మీడియాకి సమాచారం అందించారు. తాజాగా బుర్రకథ రిలీజ్ గురించి చిత్ర కథానాయకుడు ఆది సాయికుమార్ క్లారిటీనిస్తూ ఓ వీడియోని రిలీజ్ చేయడంతో పూర్తి స్పష్టత వచ్చింది.

బుర్రకథ టీజర్.. ట్రైలర్ నచ్చాయి కదా సినిమా కూడా అంతే నచ్చేస్తుంది. ఈ నెల 28న రిలీజ్ అనుకున్నాం. ఓ చిన్న సమస్య వల్ల రిలీజ్ కావడం లేదు.. అని సామాజిక మాధ్యమాల ద్వారా ఆది వెల్లడించారు. కొత్త తేదీని తొందర్లోనే నిర్మాతలు ప్రకటిస్తారని తెలిపారు. మొత్తానికి ఈ వారం రేసులో బుర్రకథ లేదని తేలిపోయింది. ఆది ప్రకటనతో శనివారం కూడా ఈ సినిమా రిలీజ్ కాదని అర్థమవుతోంది. రెండు బుర్రలు.. రెండు విభిన్నమైన ఆలోచనలతో కన్ఫ్యూజన్ క్రియేట్ చేసే కుర్రాడి కథ బుర్రకథ. ఆది ఈ చిత్రంలో రెండు విభిన్నమైన అవతారాల్లో కనిపించోతున్నాడు. మిస్తీ చక్రవర్తి- నైరా షా అతడి సరసన కథానాయికలుగా నటించారు. యంగ్ హీరో ఆది గత కొంతకాలంగా సరైన విజయం కోసం ఎంతో హార్డ్ వర్క్ చేస్తున్నాడు. ఈసారి ష్యూర్ షాట్ గా హిట్ కొట్టాలన్న పట్టుదలతో ఉన్నాడు. మరి బుర్రకథ అతడి ఫేట్ మారుస్తుందా లేదా? అన్నది వేచి చూడాలి. రైటర్ టర్న్ డ్ డైరెక్టర్ గా రత్నబాబుకు ఈ సినిమా సక్సెస్ ఎంతో ఇంపార్టెంట్.
Please Read Disclaimer