సూపర్ స్టార్ కూతురు అతడిపై క్లారిటీ ఇచ్చేసింది

0

బాలీవుడ్ సూపర్ స్టార్ అమీర్ ఖాన్ కూతురు ఇరా ఖాన్ గత కొన్ని రోజులుగా తన సోషల్ మీడియా పేజ్ లలో ఒక వ్యక్తితో చాలా చనువుగా ఉంటూ అతడిని హగ్ చేసుకుని ఉన్న ఫొటోలను పోస్ట్ చేయడం జరుగుతుంది. మొదట అంతా కూడా అతడు స్నేహితుడు అయ్యి ఉంటాడని భావించారు. కాని ఆ తర్వాత ఇద్దరి మద్య స్నేహంను మించి ఏదో ఉందనిపిస్తుందని అనుమానాలు వ్యక్తం చేశారు. సోషల్ మీడియా ద్వారా ఇరా ఖాన్ ను చాలా మంది చాలా రకాలుగా అతడి గురించి ప్రశ్నించడం జరిగింది. ఎట్టకేలకు అతడిపై ఇరా క్లారిటీ ఇచ్చింది.

సోషల్ మీడియాలో తాజాగా ఫాలోవర్స్ తో చిట్ చాట్ చేసిన ఇరా ఖాన్ వారు అడిగిన ప్రశ్నలకు సమాధానం చెప్పింది. ఆ సమయంలో మీతో ఉన్న ఆ వ్యక్తి ఎవరు.. అతడితో మీరు డేటింగ్ లో ఉన్నారా.. మీరు అతడిని ప్రేమిస్తున్నారా అంటూ ప్రశ్నించారు. ఆ ప్రశ్నలకు ఇరా దాదాపుగా ఔను అనే సమాధానం ఇచ్చింది. అతడి పేరు మిషాల్ కృపాలనీ అని అతడు ఒక సంగీత దర్శకుడు అంటూ పరిచయం చేసింది. అతడిపై తనకున్న ఇష్టంను పోస్ట్ చేసిన ఫొటోల ద్వారా చెప్పకనే చెప్పింది.

ఇరా ఖాన్ చెప్పిన విషయాలు.. ఆమె పోస్ట్ చేసిన ఫొటోల ఆధారంగా ఇద్దరు కూడా డీప్ లవ్ లో ఉండి ఉంటారు అనే చర్చ జరుగుతోంది. ఇటీవల పుట్టిన రోజు సందర్బంగా హ్యాపీ బర్త్ డే బేబీ.. నీవు చాలా సింపుల్ గా ఉంటావు అందుకే నాకు బాగా నచ్చుతావు అంటూ పోస్ట్ చేయడం జరిగింది. ఇరా ఖాన్ మరియు మిషాల్ ల పోస్ట్ లు ఒకరి గురించి ఒకరు గొప్పగా మాట్లాడటం చూస్తే వీరిద్దరు త్వరలోనే ఏదైనా గుడ్ న్యూస్ చెప్పే అవకాశం లేకపోలేదు అంటూ బాలీవుడ్ వర్గాల్లో టాక్ వినిపిస్తుంది. ఇరా ఖాన్ బాలీవుడ్ ఎంట్రీ కోసం ప్రయత్నాలు చేస్తోంది. తన కూతురు దర్శకురాలు కావాలని అమీర్ ఖాన్ ఆశపడుతున్నాడు.