కరోనా కోరల్లో స్టార్ హీరో ఫ్యామిలీ.. నెగటివ్ రావాలని ప్రార్థనలు!

0

మహారాష్ట్రలో మహమ్మారి రోజురోజుకి వేల సంఖ్యలో వ్యాప్తి చెందుతూ భయాందోళనలు సృష్టిస్తుంది. ఈ మహమ్మారి దెబ్బకి సామాన్యుల నుండి సెలబ్రిటీల వరకు మహమ్మారిబారినపడి ప్రాణాలు కోల్పోతున్నారు. మహమ్మారి వలన ముంబై ప్రస్తుతం ఊపిరి పీల్చుకోవడానికి కూడా భయపడుతోంది. అయితే ఇటీవలే బాలీవుడ్ స్టార్ హీరో అమీర్ ఖాన్ సహాయకులకి మహమ్మారిపాజిటివ్గా తేలింది. దీంతో అమీర్తో పాటు కుటుంబ సభ్యులందరికి పరీక్షలు నిర్వహించడం జరిగింది. ఆ టెస్టులలో వారందరికీ నెగెటివ్ వచ్చిందట. ఈ విషయాన్నీ స్వయంగా అమిర్ ఖాన్ సోషల్ మీడియాలో పేర్కొన్నాడు. ఇక అందరికి టెస్టులు అయిపోయాయి. కేవలం మా అమ్మ మాత్రమే మిగిలింది. తనకి పరీక్షలు నిర్వహించేందుకు ఆసుపత్రికి తీసుకెళుతున్నా. నా తల్లికి నెగెటివ్ రావాలని అందరూ ప్రార్ధించండి” అని అమీర్ ఖాన్ సోషల్ మీడియా ద్వారా కోరారు.

అంతేగాక బీఎంసీ (ముంబై మున్సిపల్ కార్పోరేషన్ అధికారులకు) చేస్తున్న సేవలకి అమిర్ ప్రత్యేకమైన కృతజ్ఞతలు తెలిపాడు. అలానే మహమ్మారిపరీక్షలు నిర్వహించడంలో ఎంతో శ్రద్ధ వహిస్తున్న కోకిలాబెన్ ఆసుపత్రి వైద్యసిబ్బందికి ప్రత్యేక ధన్యవాదాలు అని అమీర్ తన పోస్ట్లో పేర్కొన్నాడు. ఇక తన టీమ్ కి పాజిటివ్ అని తెలిసిన వెంటనే క్వారంటైన్లోకి వెళ్లిపోయారని.. అమ్మని ఆసుపత్రికి తీసుకొని వెళ్తున్నట్లు తెలిపాడు. ఇదిలా ఉండగా ఇదివరకే బాలీవుడ్లో బోనీ కపూర్ సిబ్బందికి కూడా మహమ్మారిసోకగా.. బోని ఫ్యామిలీ కూడా కొద్దిరోజుల పాటు క్వారంటైన్లో ఉన్న విషయం తెలిసిందే. ఆ తర్వాత పరీక్షలలో నెగెటివ్ అని తేలడంతో అభిమానులు ఆనందం వ్యక్తం చేశారు. అయితే ప్రస్తుతం అమీర్ ఖాన్ “లాల్ సింగ్ చద్దా” అనే సినిమాలో నటిస్తున్నాడు. 1994లో వచ్చిన ఫారెస్ట్ గంప్ అనే హాలీవుడ్ మూవీకి రీమేక్ గా వస్తున్న ఈ సినిమాకి అద్వైత్ చందన్ దర్శకత్వం వహిస్తున్నారు. ప్రస్తుతం మహమ్మారికారణంగా షూటింగ్ నిలిపేశారు. చూడాలి మరి త్వరలో ఏదైనా గుడ్ న్యూస్ వినిపిస్తుందేమో..!
Please Read Disclaimer