బిబి4 : అభిజిత్.. అఖిల్ మేక పులి ఆట

0

తెలుగు బిగ్ బాస్ సీజన్ ముగింపు దశకు వచ్చింది. మరో నాలుగు వారాల్లో షో పూర్తి కాబోతుంది. ఈసమయంలో హౌస్ లో కేవలం 8 మంది మాత్రమే ఉన్నారు. అయినా కూడా రచ్చ మామూలుగా లేదు. ఒకరంటే ఒకరు కారాలు మిరియాలు నూరుతున్నారు. ముఖ్యంగా అఖిల్ మరియు అభిజిత్ ల మద్య గొడవ తారా స్థాయిలో ఉంది. అది తాజా ఎలిమినేషన్ నామినేషన్ పక్రియలో మరోసారి వెళ్లడి అయ్యింది. అభిజిత్ పై అఖిల్ చాలా కోపంతో ఉన్నాడు. తాను సీక్రెట్ రూంకు వెళ్లిన సమయంలో అభిజిత్ చేసిన వ్యాఖ్యలను అఖిల్ అస్సలు జీర్ణించుకోలేక పోతున్నాడు.

ఆ వ్యాఖ్యల తాలూకు అర్థంను వివరించేందుకు ప్రయత్నించినా కూడా అఖిల్ వినేందుకు ఆసక్తి చూపడం లేదు. ప్రేక్షకుల ముందు అభిజిత్ ను బ్యాడ్ చేసి తాను టాప్ అవ్వాలనే ప్రయత్నాలు తీవ్రంగా చేస్తున్నాడు. తాజా ఎపిసోడ్ ఎలిమినేషన్ నామినేషన్ పక్రియ సందర్బంగా కూడా అఖిల్ మరోసారి ఆ విషయాన్ని లేవనెత్తాడు. అభిజిత్ సమాధానం చెప్పేందుకు కూడా అవకాశం ఇవ్వకుండా తానే మాట్లాడుతూ రచ్చ రచ్చ చేసిన అఖిల్ తనకు తాను పులిని అంటూ చెప్పుకోవడం నెటిజన్స్ ట్రోల్ చేస్తున్నారు. మేకను పులిని చేసి పంపించాడు అంటూ అఖిల్ చేసిన వ్యాఖ్యలకు అభిజిత్ కౌంటర్ గా మేక ఎప్పుడు పులి అవ్వదు బాబు అన్నాడు.

వీరిద్దరి మద్య సుదీర్ఘమైన చర్చ జరిగింది. అందులోకి మళ్లీ మోనాల్ ను లాగే ప్రయత్నం చేశాడు. ఇదే సమయంలో ఆయన హారికను కూడా అఖిల్ నామినేట్ చేసి ఆమెపై కూడా వ్యాఖ్యలు చేసే ప్రయత్నం చేశాడు. ఇక సోహెల్ మరియు అభిజిత్ ల మద్య కూడా వ్యవహారం కాస్త సీరియస్ గానే సాగింది. సోహెల్ మరియు హారికలు కూడా చాలా సీరియస్ గా అరుచుకున్నారు. తాజా ఎపిసోడ్ లో అఖిల్ మరియు సోహెల్ లు సహనం కోల్పోయి వ్యవహరించారు అంటూ కామెంట్స్ వస్తున్నాయి. ఇక మొత్తం 8 మందిలో ఈ వారం లాస్య హారిక అభిజిత్ మోనాల్ సోహెల్ మరియు అరియానాలు నామినేట్ అయ్యారు. వీరిలో ఎలిమినేట్ అయ్యేది ఎవరో చూడాలి.