అభినేత్రి-2 టీజర్ టాక్

0

ప్రభుదేవా.. తమన్నా హీరో హీరోయిన్లుగా నటిస్తున్న చిత్రం ‘అభినేత్రి-2’. తమిళ డైరెక్టర్ విజయ్ దర్శకత్వంలో తెరకెక్కిన ఈ సినిమా టీజర్ ఈరోజే రిలీజ్ అయింది. ఒక నిమిషం కంటే నిడివి తక్కువగా ఉన్న ఈ టీజర్లో స్టొరీలైన్ అయితే రివీల్ చేయలేదు కానీ రెండు దెయ్యాల చుట్టూ తిరిగే స్టొరీ అనే హింట్ మాత్రం ఇచ్చాడు. ‘అభినేత్రి’ లో తమన్నాను దెయ్యం అవహిస్తూ ఉంటుంది.. ఇప్పుడు ప్రభుదేవాకు కూడా ఆ సమస్య వచ్చినట్టుంది.

టీజర్ స్టార్టింగ్ లోనే ప్రభు దేవా ఇంటిగుమ్మం ముందు సడెన్ గా గాల్లోనుంచి ప్రత్యక్షం అవుతాడు. ఇంకో సీన్లో తమన్నా ప్రభుదేవాను.. ‘అలెక్స్’ అని పిలవగానే మెరుపుతీగలాగ ఫాస్ట్ గా ప్రభు కదలడంతో తమన్నా ఒక్కసారి ఉలిక్కిపడుతుంది. మొదటి భాగానికి భిన్నంగా ఈ సినిమాను ఫారెన్ లో కూడా చిత్రీకరించారు. మరో సీన్ లో కోవై సరళ ‘అమ్మో దెయ్యం’ అని భయపడుతూ ఉంటే ‘ఒక్క దెయ్యం కాదు.. రెండు దెయ్యాలు’ అని పక్కనుండే వ్యక్తి ఆవిడ టెన్షన్ ను మరింతగా పెంచుతుంది. ఇక ప్రభు హీరోగా ఉంటే డ్యాన్సులు లేకుండా ఎలా .. ప్రభుదేవా తనదైనా స్టైల్లో కొన్ని స్టెప్పులు వేసి అభిమానులను మురిపించాడు.

టీజర్లో బ్యాక్ గ్రౌండ్ స్కోర్ బాగుంది. ఓవరాల్ గా టీజర్ ఓకే అనిపిస్తోంది కానీ సూపర్ అనిపించే అంశాలైతే ఏవీ లేవు. రెగ్యులర్ హారర్ కామెడీలాగానే ఉంది. మరి సినిమాలో స్ట్రాంగ్ కంటెంట్ తో ఆకట్టుకుంటారేమో వేచి చూడాలి. ‘అభినేత్రి 2’ మే 1 న ప్రేక్షకుల ముందుకు రానుంది. అంతలోపు టీజర్ ను చూసేయండి.




Please Read Disclaimer