కూతురు దృష్టిలో చెడ్డవాడు కాకూడదని ఎన్నో సినిమాలు వదిలేశాడట

0

బాలీవుడ్ లో ఒక వైపు నెపొటిజం గురించి పెద్ద ఎత్తున చర్చ జరుగుతున్న విషయం తెల్సిందే. కేవలం స్టార్స్ వారసులు మాత్రమే స్టార్స్ గా వెలుగు వెలుగుతున్నారు. బ్యాక్ గ్రౌండ్ లేని వారు సినిమాల్లోకి వస్తే వారిని తొక్కేసేందుకు ఇండస్ట్రీ నుండి బయటకు పంపించేందుకు ప్రయత్నాలు జరుగుతున్నాయి అనేది చాలా మంది వాదన. సుశాంత్ ఆత్మహత్య తర్వాత ఆ విషయంపై మరింత చర్చ జరుగుతోంది. అయితే అభిషేక్ బచ్చన్ వంటి వారిని చూస్తే మాత్రం స్టార్స్ వారసులు అయినా కూడా లక్ లేకుంటే స్టార్స్ అవ్వలేరు అంటూ కొందరు అంటున్నారు.

బాలీవుడ్ బిగ్ బి అయిన అమితాబచ్చన్ నట వారసుడిగా ఎంట్రీ ఇచ్చిన అభిషేక్ బచ్చన్ గత కొంత కాలంగా సరిగా సినిమాలే చేయడం లేదు. ఆయనకు ఆఫర్లు రావడం లేదు అనేది టాక్. కాని తాజాగా అభిషేక్ బచ్చన్ తన కొత్త వెబ్ సిరీస్ ప్రమోషన్ లో భాగంగా మాట్లాడుతూ తనకు ఆఫర్లు రాకపోవడం వల్ల సినిమాలు తగ్గలేదని తానే కావాలని సినిమాలను తగ్గించుకున్నాను అంటూ వ్యాఖ్యలు చేశాడు.

8 సంవత్సరాల క్రితం తనకు కూతురు పుట్టిన సమయంలో నేను ఇకపై సినిమాల్లో రొమాంటిక్ సీన్స్ లో నటించకూడదని నిర్ణయించుకున్నాను. నా కూతురు ఆ సీన్స్ వల్ల ఇబ్బంది పడకూడదు. భవిష్యత్తులో నన్ను అలాంటి సీన్స్ గురించి తను నన్ను ప్రశ్నించకూడదు. అందుకే నా కూతురు పుట్టినప్పటి నుండి ఇప్పటి వరకు అలాంటి సీన్స్ ఉన్న పాత్రలనీ కూడా వద్దన్నాను. అలా నా వద్దకు వచ్చిన చాలా సినిమాలను కాదనుకున్నాను అన్నాడు. అయితే అభిషేక్ వ్యాఖ్యలపై నెటిజన్స్ ట్రోల్స్ చేస్తున్నారు. ఇది మరీ జోక్ గా ఉంది.. ఛాన్స్ లు లేక సినిమాలకు దూరం అయిన అభిషేక్ ఇప్పుడు కూతురు పేరు చెప్పి కవర్ చేసుకుంటున్నాడు అంటూ కామెంట్స్ చేస్తున్నారు.
Please Read Disclaimer