అడవి శేష్ ని నిలదీసిన అభిషేక్

0

ఒకప్పుడు యాభై రోజులు వంద రోజుల ట్రెండ్లు కాస్తా ఇప్పుడు పూర్తిగా కలెక్షన్స్ వైపు తిరిగిపోయిన సంగతి తెలిసింది. ఎంత ఆడింది అనే దాని కన్నా ఎంత వసూలు చేస్తోంది అనేదాని మీదే సినిమా సక్సెస్ ఫెయిల్యూర్ ని డిసైడ్ చేస్తున్నారు. కాకపోతే వీటిని ప్రకటించే క్రమంలో ఒకటికి రెండు సార్లు చెక్ చేసుకోకపోతే సోషల్ మీడియా వేదికగా నిలదీతలు తప్పవు. దానికి ఉదాహరణగా ఎవరు నిలుస్తోంది.

విడుదలైనప్పుడు మంచి టాక్ తో వసూళ్లతో నడిచిన ఎవరు ఆ తర్వాత స్లో అయిపోయింది. అయితే హీరో అడవి శేష్ మాత్రం రెగ్యులర్ గా ప్రమోట్ చేసుకుంటూనే ఉన్నాడు. హీరో కాబట్టి ఆ బాధ్యత తీసుకోవడం న్యాయమే. కానీ తాజాగా ఎవరు సినిమా తన కెరీర్ బెస్ట్ గూఢచారి వసూళ్లను దాటేసి రికార్డు సృష్టించినందుకు గాను సంతోషంగా ఉందని శేష్ ట్వీట్ చేశాడు

సరే ప్రేక్షకుల వద్ద ఆధారాలు ఉండవు కాబట్టి ఇదంతా నిజమే అనుకునే ఛాన్స్ ఉంది కానీ నిర్మాతల వ్యవహారం అలా ఉండదుగా. వెంటనే గూఢచారి నిర్మాత అభిషేక్ పిక్చర్స్ సీన్ లోకి వచ్చింది. గూఢచారిని ఎవరు క్రాస్ చేయడం ఎలా సాధ్యం కాస్త కలెక్షన్ వివరాలు చేస్తారా అంటూ అడవి శేష్ కి రీ ట్వీట్ చేయడం ఇప్పుడు హాట్ టాపిక్ గా మారింది.

మీ ఫిలిం కెరీర్ లో గూఢచారినే అతి పెద్ద కమర్షియల్ హిట్టని అభిషేక్ సంస్థ పేర్కొనడం గమనార్హం. ఇప్పుడు శేష్ ఏం సమాధానం ఇస్తాడనేది ఆసక్తికరంగా మారింది. ఖచ్చితంగా ఫిగర్స్ ని చూపించి గూఢచారిని ఎవరు క్రాస్ చేసిందని రుజువు చేస్తేనే ట్వీట్ కు వేల్యూ ఉంటుంది. అది జరగకపోతే అబద్దం చెప్పినట్టేగా. చూద్దాం ఏం జరుగుతుందో
Please Read Disclaimer