అబ్రామ్ కు ఎల్లో బెల్ట్ అంటున్న షారూఖ్

0

‘బాలీవుడ్ బాద్షా.. కింగ్ ఖాన్ షారూఖ్ ఖాన్’.. ఇలా ఇంట్రో ఇస్తే జనాలు కొడతారేమో ఇప్పుడు. అందుకే ఈ బిరుదులకు ముందు ‘ఒకప్పటి’ అనే పదం జోడించండి. పర్ఫెక్ట్ గా సెట్ అవుతుంది. వరస ఫెయిల్యూర్ లతో షారూఖ్ మార్కెట్ భారీగా దెబ్బ తిన్న విషయం తెలిసిందే. అభిమానులు మాత్రం షారూఖ్ మళ్ళీ బౌన్స్ బ్యాక్ అవుతాడని ఆశగా.. నమ్మకంగా ఉన్నారు. అయితే ఈ గోలతో.. కెరీర్ ఒక్కసారిగా తిరగబడడంతో షారూఖ్ సినిమాలకు కాస్త గ్యాప్ తీసుకుని ఫ్యామిలీతో సమయం గడుపుతూ రీఛార్జ్ అవుతున్నాడు.

షారూఖ్ -గౌరీ దంపతులకు ముగ్గురు సంతానం. ఆర్యన్ ఖాన్.. సుహానా ఖాన్.. అబ్రామ్ ఖాన్. ముగ్గురిలో ఎవరు మీడియా దృష్టిని ఎక్కువగా ఆకర్షిస్తారు అని అడిగితే కొంతమంది సుహానా అని చెప్తారేమో కానీ అది సరైన సమాధానం కాదు. చిన్నబ్బాయి అబ్రామ్ అంటే సోషల్ మీడియాలో యమా క్రేజు. అచ్చుగుద్దినట్టు నాన్నలాగే ఉండడం తో పాటు నాన్నగారి స్టైల్ పూర్తిగా వచ్చేసింది. ఆ క్యూట్ లుక్స్ ను చూసి ఫ్లాట్ అయిపోని నెటిజన్లు చాలా తక్కువమంది ఉంటారు. ఇప్పుడు ఈ బాబు టాపిక్ ఎందుకు అంటే తాజాగా షారూఖ్ తన ముద్దుల కొడుకు ఫోటో పోస్ట్ చేసి అబ్రామ్ కు టేక్వాండోలో ఎల్లో బెల్ట్ వచ్చిందని తెలిపాడు.

ఈ ఫోటోకు “కుటుంబం లోని టేక్వాండో ట్రెడిషన్ ను కొనసాగిస్తున్న అబ్రామ్. కిరణ్ టీచర్ ఫైట్ క్లబ్ లో కొత్త సభ్యుడు. ఎల్లో బెల్ట్ వచ్చింది” అంటూ క్యాప్షన్ ఇచ్చాడు. ఈ ఫోటోతో పాటుగా ఆర్యన్.. సుహానా టేక్వాండో చేస్తున్న పాత ఫోటోలను కూడా పంచుకున్నాడు. ఇక ఈ ఫోటోలకు వన్ మిలియన్ కు పైగా లైక్స్ వచ్చాయి. అబ్రామ్ క్యూట్ గా ఉన్నాడని .. జూనియర్ షారూఖ్ లాంటి కామెంట్లు పెట్టారు.
Please Read Disclaimer