ఏంటి ఏదో పోలిక కనిపిస్తోందేంటి ఆచార్య?

0

మెగాస్టార్ చిరంజీవి బర్త్ డే గిఫ్ట్ అదిరింది. ‘ఆచార్య’ మోషన్ పోస్టర్ గూగుల్ ట్రెండింగులో ట్రెండ్ సెట్ చేస్తూ దూసుకెళుతోంది. ఇక ఈ పోస్టర్ లుక్ అదిరిందన్న ప్రశంసలు దక్కాయి. పోస్టర్ లో పోరాటాల కామ్రేడ్లా చిరు లుక్ ఆకర్షించింది. అలాగే ధర్మస్థలి అనే గ్రామం చూపిస్తూ.. కొందరు పేదవారు ధీనంగా చూస్తుంటే.. అన్యాయాలు అరాచకాల్ని ఎదిరించేవాడిగా పోస్టర్ రక్తి కట్టించింది. మణిశర్మ ఇచ్చిన బ్యాక్గ్రౌండ్ మ్యూజిక్ ఘాడమైన ముద్ర వేసింది.

అదంతా సరే కానీ .. ఈ మోషన్ పోస్టర్ కోసం ఉపయోగించిన కలరింగ్ మాత్రం ఇప్పుడు మరో కోణంలో విశ్లేషణల ఫర్వానికి తెర తీసింది. మెగా మూవీ పోస్టర్స్ లో వాడే కలర్ ని కూడా మెగా ఫ్యాన్స్ సెంటిమెంట్ గా భావిస్తారు. ఇప్పుడు ఆచార్య పోస్టర్స్ మీద కూడా ఫ్యాన్స్ గ్రూప్స్ లో వేడి డిస్కషన్ నడుస్తోంది. ఆచార్య టైటిల్ కి వాడిన కలర్.. అంజి సినిమా టైటిల్ కి వాడిన కలర్ ఒకటే అని ఫ్యాన్స్ అంటున్నారు.

అంజి మూవీ కూడా ఇలానే చాలా లేట్ గా వాయిదాల ఫర్వంలో వచ్చింది. ఎన్నో వాయిదాల తరువాత రిలీజ్ అయింది. ఆ సినిమా మీద కూడా భారీగానే అంచనాలు అప్పట్లో పెట్టుకున్నారు ఫ్యాన్స్. ఇంకో పాయింట్ ఏంటంటే ఇందులో చిరంజీవి ఇలా దేవుడుకి సంబంధించిన కాన్సెప్ట్స్ తో సినిమాలు తీసిన ప్రతి సారీ సినిమాలు డిజాస్టర్స్ గా మిగిలిపోయాయి. ఆచార్య దేవుడు దేవాలయాల కాన్సెప్ట్ అని ప్రచారమైంది. మరి ఆచార్య ఫేట్ ఎలా ఉంటుందో చూడాలంటూ గుసగుసలు ఫిలింసర్కిల్స్ లో వేడెక్కిస్తున్నాయ్. అయితే అపజయమెరుగని కొరటాల ఆచార్య కోసం ఎలాంటి మ్యాజిక్ చేయబోతున్నారు? అన్నది ఉత్కంఠ పెంచుతోంది.