‘ఆచార్య’ సెట్స్ పైకి వెళ్ళేది అప్పుడేనా…?

0

మెగాస్టార్ చిరంజీవి – డైరెక్టర్ కొరటాల శివ కాంబినేషన్ లో తెరకెక్కుతున్న సినిమా ‘ఆచార్య’. కొణిదెల ప్రొడక్షన్స్ బ్యానర్ పై రామ్ చరణ్ మరియు మాట్నీ మూవీస్ నిరంజన్ రెడ్డి సంయుక్తంగా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు. చిరంజీవి కెరీర్లో 152వ చిత్రంగా తెరకెక్కుతున్న ఈ సినిమాపై భారీ అంచనాలే ఉన్నాయి. రామ్ చరణ్ కూడా కీలక పాత్రలో కనిపిస్తుండటంతో మెగా ఫ్యాన్స్ ఈ సినిమా కోసం ఆసక్తిగా ఎదురుచూస్తున్నారు. ఇక ఈ సినిమాలో చిరు దేవాదాయ శాఖలో పనిచేసే ఉద్యోగిగా నటిస్తున్నాడని.. దేవాదాయ శాఖలో జరిగే అక్రమాలు.. ప్రభుత్వ భూముల కబ్జాలు తదితర అంశాలతో సందేశాత్మకంగా ఈ సినిమా ఉండబోతోందని ప్రచారం జరుగుతోంది. ఇక ‘ఆచార్య’లో కాజల్ హీరోయిన్ మెయిన్ హీరోయిన్ గా నటిస్తుండగా రెజీనా కాసాండ్రా స్పెషల్ సాంగ్ చేస్తోంది. మణిశర్మ సంగీతం అందిస్తున్నారు.

కాగా ఇప్పటికే సగ భాగం చిత్రీకరణ జరుపుకున్న ‘ఆచార్య’ కరోనా మహమ్మారి వల్ల ఏర్పడిన పరిస్థితుల వలన ఆగిపోయింది. అయితే త్వరలోనే షూటింగ్ స్టార్ట్ చేయాలని భావించిన చిత్ర యూనిట్ రామోజీ ఫిల్మ్ సిటీలో ఓ పురాతన దేవాలయం సెట్ వేస్తున్నారని వార్తలు వచ్చాయి. కరోనా ప్రభావం తగ్గితే ఆగస్టు నుంచి ఈ సెట్ చిత్రీకరణ జరపాలని ప్లాన్ చేసుకుంటున్నారు. అయితే తాజా సమాచారం ప్రకారం ప్రొడ్యూసర్స్ లో ఒకరైన రామ్ చరణ్ ఇప్పుడప్పుడే ‘ఆచార్య’ షూటింగ్ వద్దు అనే ఆలోచనలో ఉన్నాడట. హైదరాబాద్ లో రోజురోజుకి కరోనా కేసులు పెరుగుతుండటంతో మరి కొన్నాళ్ళు వేచి చూడాలని నిర్ణయించుకున్నారట. వ్యాక్సిన్ వచ్చే దాకా ‘ఆచార్య’ సెట్స్ పైకి వెళ్లే అవకాశాలు లేవని తెలుస్తోంది. ఇక పవన్ కళ్యాణ్ కూడా వ్యాక్సిన్ వచ్చే వరకు షూటింగ్స్ స్టార్ట్ చేయకపోవడమే మంచిదని.. ప్రభుత్వాలు షూటింగులకు అనుమతించినప్పటికీ మరి కొన్నాళ్లు వెయిట్ చేస్తూ ఉండాలని చెప్పుకొచ్చారు. మొత్తం మీద మెగా హీరోలు ఎవరూ ఇప్పట్లో సెట్స్ లో అడుగుపెట్టే అవకాశం లేదని అర్థం అవుతోంది.