ట్రైలర్ టాక్: ‘యాక్షన్’

0

విశాల్ ట్యాలెంట్ గురించి ప్రత్యేకించి పరిచయం అవసరం లేదు. నడిగర సంఘం రాజకీయాల్లో మొండోడిగా పోరాడుతూ నిరంతరం హాట్ టాపిక్ అవుతున్నాడు. తంబీల రాజ్యంతో తెలుగు కుర్రాడి పోరాటం చూస్తున్నదే. అదంతా అటుంచితే.. తాజాగా అతడు నటిస్తున్న `యాక్షన్` చిత్రం హాట్ టాపిక్ గా మారింది. సుందర్ సి. దర్శకత్వంతో రూపొందుతున్న ఈ సినిమాలో మిల్కీ బ్యూటీ తమన్నా- ఐశ్వర్యా లక్ష్మీ నాయికలు. హిప్ హాప్ తమిళ సంగీతం అందిస్తున్నారు.

దీపావళి కానుకగా రిలీజ్ చేసిన ట్రైలర్ నభూతోనభవిష్యతి అని పొగిడేయాల్సిందే. ఇంతకుముందు రిలీజ్ చేసిన టీజర్ కి పదింతలు భారీ యాక్షన్ ని ఈ ట్రైలర్ లో ఆకట్టుకుంది. విజువల్ రిచ్ ట్రైలర్ మైండ్ బ్లోయింగ్. విశాల్ కెరీర్ లోనే నెవ్వర్ బిఫోర్ యాక్షన్ సినిమాలో నటిస్తున్నాడని ట్రైలర్ చెబుతోంది. ఓ అంతర్జాతీయ సమస్య.. దాని చుట్టూ పోలీసుల హడావుడి.. అందులోనే ఇండియన్ ఆఫీసర్ విశాల్ ఎంట్రీ అతడితో పాటే తమన్నా భారీ యాక్షన్ ఇదంతా చూస్తుంటే అబ్బో అని పొగిడేయకుండా ఉండలేం. సుందర్ సి కి ఈ తరహా భారీ యాక్షన్ మూవీ కొత్త. అతడు ఇదివరకూ పాన్ ఇండియా ప్రయత్నం చేసి విఫలమైన నేపథ్యంలో ఆ కసి ఇలా తీర్చుకుంటున్నాడా? అన్న సందేహం కలుగుతోంది. ఈ ట్రైలర్ లో టర్కీ బ్యాక్ డ్రాప్ లో ఇళ్లపై నుంచి దూసుకెళ్లే బైక్ ఛేజ్ లు.. విశాలమైన రోడ్లపై కార్ ఛేజ్ లు వగైరా హైలైట్ గా ఉన్నాయి. ఇక తమన్నాతో కలిసి విశాల్ భారీ భవంతి నుంచి జంప్ చేస్తున్న సీన్ ఫెంటాస్టిక్. ప్రతి నిమిషం యాక్షన్ యాక్షన్ యాక్షన్ అన్నట్టే ఉంది ట్రైలర్. ఆ జంప్ లు సాహసాలు చూస్తుంటే ఇండియా లెవల్లో ఈ సినిమాని రిలీజ్ చేస్తున్నారని అర్థమవుతోంది. అందుకు తగ్గట్టే భారీ విజువల్స్ కోసం అంతే భారీగా ఖర్చు చేశారు.

యాక్షన్ ట్రైలర్ యూట్యూబ్ లో ట్రెండింగ్ లో దూసుకుపోతుండడంతో విశాల్ సంతోషం వ్యక్తం చేశాడు. ఈ సందర్భంగా అభిమానులకు ధన్యవాదాలు తెలిపాడు. విశాల్- సుందర్. సి కాంబినేషన్ అంటే అంబాల-మదగజరాజా చిత్రాలు గుర్తుకొస్తాయి. తాజాగా యాక్షన్ చిత్రంతో హిట్టు కొట్టే ప్రయత్నంలో ఉన్నారు. తెలుగు-తమిళ్ లో ఈ చిత్రం భారీగా రిలీజ్ కానుంది. ట్రైలర్ ఆద్యంతం మాట కంటే యాక్షన్ తోనే ఎక్కువగా కనిపిస్తోంది కాబట్టి ఇది యూనివర్శల్ అప్పీల్ ఉన్న కథాంశమని అర్థమవుతోంది. ట్రైలర్ లో ఉన్నంత మ్యాటర్ సినిమాలో ఉంటే బొమ్మ బ్లాక్ బస్టరే. అంతుందా? అన్నది చూడాలి. ట్రైడెంట్ ఆర్ట్స్ ఆర్.రవీంద్రన్ ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారు.
Please Read Disclaimer