ఆడవాళ్ల పై సీనియర్ హీరో కామెంట్స్

0

ఆయనో సీనియర్ హీరో. కోలీవుడ్ లో దర్శకుడిగా.. హీరోగా… కథకుడిగా.. సంగీత దర్శకుడి గా ఆయనకు మంచి పేరుంది. 80వ దశకం లో ఆయన చేసిన సినిమాలు తెలుగు.. తమిళ భాషల్లో సూపర్హిట్లుగా నిలిచాయి. కెరీర్ లో ఎన్నో బ్లాక్ బస్టర్లు కొలువు దీరాయి. కానీ ఆయన మాట తీరే ఇప్పుడు ఆడాళ్లను నొప్పిస్తోంది. పెనువివాదానికి దారి తీసిన ఆయన కామెంట్ విస్మయానికి గురి చేయకుండా ఉండదు.

ఫ్యామిలీ.. రొమాంటిక్ కామెడీ చిత్రాల కు కేరాఫ్ అడ్రెస్ గా నిలిచిన సీనియర్ దర్శకుడు కె.భాగ్యరాజా తాజా ఆడవాళ్లపై చేసిన కామెంట్స్ సోషల్ మీడియాలో సంచలనం సృష్టిస్తున్నాయి. ఓ తమిళ సినిమా ఆడియో ఫంక్షన్ లో పాల్గొన్న భాగ్యరాజా ఆడవాళ్ల పై జరుగుతున్న అత్యాచారాలకు ప్రధాన కారణం ఆడవాళ్లేనని తేల్చి చెప్పడం వేడెక్కిస్తోంది.

గతంలో కట్టుదిట్టమైన కట్టుబాట్ల కారణంగా ఆడవాళ్ల పై ఎలాంటి అఘాయిత్యాలు జరగలేదని.. ఎప్పుడైతే ఆడవాళ్లు సెల్ ఫోన్లు వాడటం.. పోర్న్ సైట్లు చూడటం మొదలు పెట్టారో అప్పటి నుంచే వారిపై అత్యాచారాలు మొదలయ్యాయిని చెప్పడం దేశ వ్యాప్తంగా సంచలనం సృష్టిస్తోంది. ఇటీవల పొల్లాచ్చిలో జరిగిన సంఘటన గురించి మాట్లాడుతూ అమ్మాయిల పొరపాటు వల్లే వారిపై అత్యాచారం జరిగిందని తీవ్ర స్థాయిలో అమ్మాయిలపై విరుచుకుపడ్డారు. దీంతో సోషల్ మీడియా మొత్తం భాగ్యరాజాపై దుమ్మెత్తిపోస్తోంది. సాఫ్ట్ గా కనిపించే భాగ్యరాజా బాధ్యతగా వ్యవహరించాల్సిందిపోయి అమ్మాయిలపై మహిళలపై బాధ్యతారాహిత్యంగా వ్యాఖ్యలు చేయడం బాగా లేదని.. అతను మహిళలకు క్షమాపణ చెప్పాలని నెటిజనులు తీవ్ర స్థాయిలో మండి పడుతున్నారు.
Please Read Disclaimer