డెలవరీ బాయ్ గా మారిన నటుడి దీన పరిస్థితి

0

సినిమా అనేది ఎప్పుడు ఎవరిని స్టార్ గా చేస్తుందో తెలియదు. ఎప్పుడు ఎవరికి గుర్తింపు తెచ్చి పెడుతుందో తెలియదు. అందుకే సినిమాల్లో అవకాశం కోసం ఎదురు చూసే వారు అదృష్టం కోసం కూడా ఎదురు చూస్తూ ఉంటారు. ఎన్ని కష్టాలు వచ్చినా కూడా నటనకు మాత్రం స్వస్థి చెప్పకుండా కంటిన్యూ చేస్తూనే ఉంటారు. హిందీ నటుడు చేతన్ రావు ప్రస్తుతం గడ్డు పరిస్థితిని ఎదుర్కొంటున్నాడు. సినిమాల్లో మరియు వెబ్ సిరీస్ లలో నటించిన చేతన్ రావు పార్ట్ టైం గా ఫుడ్ డెలవరీ బాయ్ గా చేస్తున్నాడట.

చాలా రోజులుగా చేతన్ రావు ఫుడ్ డెలవరీ బాయ్ గా చేస్తున్నాడట. అయితే తాజాగా రాజేష్ అనే ఒక వ్యక్తి చేతన్ ను గుర్తు పట్టి మీరు నటిస్తారు కదా.. మీరు నటుడు కదా అంటూ ప్రశ్నించాడట. అందుకు చేతన్ ఔను అంటూ సమాధానం చెప్పడంతో ఆశ్చర్య పోయిన రాజేష్ ఏంటీ ఇలా అంటూ ప్రశ్నించాడట. అయితే అవకాశాలు లేని సమయంలో తాను ఇలా డెలవరీ బాయ్ గా చేస్తూ ఉంటాను. ఏదైనా ఛాన్స్ వచ్చినప్పుడు తాత్కాలికంగా జాబ్ ను పక్కకు పెడతానంటూ చెప్పాడట.

రాజేష్ ఈ విషయాన్ని సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. ఇలాంటి వారిని చూస్తుంటే గర్వంగా ఉంది అంటూ రాజేష్ ట్వీట్ చేశాడు. రాజేష్ ట్వీట్ తో ఎవరీ చేతన్ రావు అంటూ అంతా వెదకడం మొదలైంది. చేతన్ రావు గతంలో నటించిన సినిమాలు ఏంటీ అంటూ ఎంక్వౌరీ చేస్తున్నారు. తాజాగా సల్మాన్ నటించిన ‘భారత్’ చిత్రంలో కూడా ఇతడు చిన్న పాత్రను పోషించాడు. సోషల్ మీడియా ద్వారా ఒక్కసారిగా సెలబ్రెటీ అయిన చేతన్ రావు కు ఇప్పుడైనా మంచి ఆఫర్లు వస్తాయేమో చూడాలి.
Please Read Disclaimer