కార్ల దొంగతనంలో సినీ నటుడు: ఆశ్చర్యానికి గురైన పోలీసులు

0

సులువుగా సంపాదించడం కోసం కొందరు దొంగతనాల వైపు ఆకర్షితులవుతుంటారు. దొరికితే దొంగ.. దొరక్కపోతే దొర అనే సూత్రాన్ని నమ్ముకుని నేరాల వైపు మరలుతుంటారు. ఒకవేళ పోలీసులకు దొరికినా కొన్నాళ్లు జైల్ లో ఉండొచ్చి బయటకు వచ్చిన అనంతరం మళ్లీ దొంగతనం చేసి ఎంజాయ్ చేయొచ్చనే ప్లాన్‌లో ఎంతో మంది నేరస్తులు ఉన్నారు. ఆ విధంగా వారికి ఎంజాయ్మెంట్.. కొన్నాళ్లు జైలు జీవితం వారికి పరమానందం తెప్పిస్తుంటుంది. అందుకే చాలామంది నేరస్తులు ఒకసారి జైలుకు వెళ్లొచ్చిన వారు మళ్లీ దొంగతనాలకు పాల్పడుతూ దొరికిన వారు ఎంతో మంది ఉన్నారు. తాజాగా ఇలాగే ఒక నేరస్తుడు పోలీసులకు పట్టుబడగా అతడి వివరాలు తెలుసుకుని పోలీసులు అవాక్కయ్యారు. అతడు ఒక సినీ నటుడు.. పైగా జర్నలిస్ట్‌గా కొనసాగుతుండడం విశేషం. ఈ ఘటన ఉత్తరప్రదేశ్ రాష్ట్రంలో చోటుచేసుకుంది.

కొన్నాళ్లుగా ఉత్తరప్రదేశ్‌లో పెద్ద ఎత్తున కార్లు దొంగతనానికి గురవుతున్నాయి. అవి కూడా లగ్జరీ.. కాస్ట్లీ కార్లు దొంగతనానికి గురవుతుండడంతో పోలీసులు సవాల్‌గా తీసుకున్నారు. దీంతో పోలీసుటు గట్టి నిఘా పెట్టి దొంగతనాలకు పాల్పడేవారిని పట్టుకునేందుకు చర్యలు ప్రారంభించారు. ఆ క్రమంలోనే ఎట్టకేలకు కార్ల దొంగతనానికి పాల్పడే ముఠా పోలీసులకు పట్టుబడింది. వారిని విచారించగా ఆ ముఠాలో ఓ వ్యక్తి సినీ నటుడని తేలింది. ఆ సినీ నటుడు కమ్ దొంగ ప్రస్తుతం జర్నలిస్టుగా కూడా కొనసాగుతుండడం గమనార్హం. ఈ వ్యక్తి మూడు సినిమాల్లో నటించాడు.

జల్సాలకు అలవాటు పడిన యువత ముఠాగా మారి 50కి పైగా లగ్జరీ కార్లు దొంగతనం చేశారని లక్నో పోలీసులు తెలిపారు. లగ్జరీ లైఫ్‌కు అలవాటుపడిన యువత సులభంగా డబ్బు సంపాదించేలా కార్ల దొంగతనం ఎంచుకున్నారని చెప్పారు. సినిమాల్లో సంపాదించే డబ్బు సరిపోకపోవడంతో అతడు ఖాళీ సమయంలో కార్ల దొంగతనం చేస్తున్నట్లు వివరించారు. ఈ వార్త ఉత్తరప్రదేశ్‌లో హాట్ టాపిక్‌గా మారింది.
Please Read Disclaimer