కిక్ శ్యామ్ నోరు తెరిస్తే ఆ స్టార్స్ కెరీర్ గళ్లంతేనా?

0

రెండు రోజుల క్రితం గ్యాంబ్లింగ్ కేసులో అరెస్ట్ అయిన నటుడు కిక్ శ్యామ్ ను పోలీసులు ప్రస్తుతం విచారిస్తున్నట్లుగా తెలుస్తోంది. ఈ కేసులో చాలా పెద్ద తలకాయలు ఉన్నట్లుగా తమిళ మీడియా వర్గాల్లో చర్చ జరుగుతోంది. అయితే పోలీసులు మాత్రం ఆచితూచి అడుగులు వేస్తూ ఈ కేసుకు సంబంధించి ఎలాంటి విషయాలు బయటకు రాకుండా జాగ్రత్త పడుతున్నారట. గ్యాంబ్లింగ్ జరుగుతున్నట్లుగా తెలుసుకున్న పోలీసులు శ్యామ్ తో పాటు మరో 13 మందిని అరెస్ట్ చేశారు. వారి వద్ద ఉన్న సమాచారంతో కోలీవుడ్కు చెందిన కొందరిని కూడా ప్రశ్నించే అవకాశం కనిపిస్తుంది.

లాక్ డౌన్ లో షూటింగ్స్ లేని కారణంగా కోలీవుడ్కు చెందిన పలువురు ప్రముఖులు రాజకీయ నాయకుల వారసులు మరియు వ్యాపారవేత్తలు బుల్లి తెరకు చెందిన వారు పదుల సంఖ్యలో ప్రతి రోజు శ్యామ్ నిర్వహిస్తున్న గ్యాంబ్లింగ్ ఆడేవారు అంటూ అనుమానాలు వ్యక్తం అవుతున్నాయి. కొన్ని వారాల క్రితం ఒక నటుడు ఈ గ్యాంబ్లింగ్ లో ఏకంగా పాతిక లక్షల రూపాయలను పోగొట్టుకున్నట్లుగా ప్రచారం జరుగుతోంది. అయితే ఆ నటుడు ఎవరు అనే విషయంలో మాత్రం బయటకు రావడం లేదు.

శ్యామ్ ను కాస్త లోతుగా విచారిస్తే ఆయన పలువురి పేర్లు చెప్తాడనే టాక్ వినిపిస్తుంది. ఒక వేళ శ్యామ్ కనుక నోరు విప్పి అందరి పేర్లు చెబితే కొందరు హీరోలు మరియు హీరోయిన్స్ తో పాటు కోలీవుడ్ కు చెందిన పలువురి కెరీర్ గళ్లంతయినట్లే అంటూ మీడియా సర్కిల్స్ లో టాక్ వినిపిస్తుంది. అయితే ఆ స్టార్స్ తమకున్న పొలిటికల్ పవర్ తో ఆ కేసును నీరు గార్చే అవకాశం లేకపోలేదు. కిక్ శ్యామ్ నోరు విప్పినా కూడా పెద్దగా నష్టం లేకుండా స్టార్స్ ముందు జాగ్రత్తలు పడుతున్నారట. తప్పు చేసిన ఆ స్టార్స్ ఆ తప్పును కప్పి పుచ్చుకునేందుకు ఇప్పుడు భయంతో వణికి పోతున్నారు అంటూ కోలీవుడ్ లో గుసగుసలు వినిపిస్తున్నాయి.