ప్రముఖ నటుడు ‘కిక్’ శ్యామ్ అరెస్ట్

0

ప్రముఖ సినీ నటుడు అరెస్ట్ కావడం కలకలం రేపింది. పేకాట బెట్టింగ్ నిర్వహిస్తున్నట్టు పోలీసులు గుర్తించి నటుడిపై కేసు నమోదు చేశారు. కిక్ సినిమాలో రవితేజను పట్టుకునే పోలీస్ ఆఫీసర్ గా అలరించిన నటుడు శ్యామ్ ని చెన్నై పోలీసులు తాజాగా అరెస్ట్ చేశారు. సినీ ఇండస్ట్రీలో ఈ అరెస్ట్ చర్చనీయాంశంగా మారింది.

చెన్నైలోని కోడం బాక్కంలో పోకర్ క్లబ్ నడుపుతున్న శ్యామ్.. అవకతవకలకు పాల్పడుతున్నట్టు పోలీసులు గుర్తించారు. ఎటువంటి అనుమతులు లేకుండా పేకాట.. బెట్టింగులు నిర్వహిస్తుండడంతో కేసు నమోదు చేశారు. తాజాగా అరెస్ట్ చేశారు.

తెలుగు తమిళ సినిమాల్లో సహ హీరోగా శ్యామ్ నటించి పేరు తెచ్చుకున్నాడు. తెలుగులో కిక్ ఊసరవెళ్లి రేసుగుర్రం కిక్2 వంటి చిత్రాల్లో నటించి మంచి గుర్తింపు పొందాడు. ఎక్కువగా దర్శకుడు సురేందర్ రెడ్డి సినిమాల్లో కనిపించాడు.కిక్ సినిమాతో ఎంట్రీ ఇవ్వడంతో తెలుగు లో ‘కిక్ శ్యామ్’ గా ముద్రపడిపోయాడు.Please Read Disclaimer