గాయని తో నటుడి మార్ఫింగ్ ఫోటో వైరల్

0

ఇంటర్నేషనల్ సెన్సేషన్.. అమెరికన్ పాప్ స్టార్ కేటీ పెర్రీ ముంబై పర్యటన గురించి తెలిసిందే. ఈ ఆదివారం లైవ్ మ్యూజిక్ కాన్సెర్టు తో కేటీ ఇండియన్ ఫ్యాన్స్ కి అదిరి పోయే ట్రీటివ్వబోతోంది. ఈలోగానే ముంబై లో మీడియా సమావేశాలు.. పార్టీలు అంటూ ఈ పాప్ గాయని చేస్తున్న సందడి ప్రముఖం గా చర్చ కు వచ్చింది.

ఇంతకు ముందు బాలీవుడ్ దర్శక నిర్మాత కరణ్ జోహార్ కేటీ కోసం అదిరి పోయే పార్టీ ఇచ్చారు. ఈ పార్టీ లో బాలీవుడ్ టాప్ స్టార్లు పాల్గొని తనతో ఫోటోలు దిగిన సంగతి తెలిసిందే. ఆ ఫోటోలు ప్రస్తుతం అంతర్జాలం లో జోరుగా వైరల్ అవుతున్నాయి. ఆ క్రమం లోనే కేటీ పెర్రీతో కమెడియన్ సునీల్ గ్రోవర్ కలిసి ఉన్న ఓ ఫోటో ఒకటి మీడియా లో హాట్ టాపిక్ గా మారింది. ఈ ఫోటో లో కేటీని హత్తుకున్నంత దగ్గరగా ఫోజిచ్చి కనిపిస్తున్నాడు సునీల్ గ్రోవర్. ఫ్యాన్స్ సామాజిక మాధ్యమాల్లో జోరుగా వైరల్ అవుతున్న ఈ ఫోటో మార్ఫ్ డ్ ఫోటో కావడం తో దీని పై ఒక్కొక్కరు ఒక్కోలా ఫన్నీ కామెంట్లు పోస్ట్ చేస్తున్నారు.

ఈ మార్ఫింగ్ ఫోటో ని సునీల్ గ్రోవర్ స్వయంగా షేర్ చేసి దానికో క్యాప్షన్ ఇచ్చాడు. “అందరిలానే కేటీతో నేను కూడా ఫోటో దిగాను. తను చాలా వినయవిధేయతలు తెలిసిన గాయని“ అంటూ సరదాగా వ్యాఖ్యానించాడు. దీనిపై అభిమానులు ఒక్కొక్కరూ ఒక్కోలా స్పందించారు. సునీల్ గ్రోవర్ పై బాలీవుడ్ టాప్ సెలబ్రిటీ లు సరదా కామెంట్లు చేశారు.

టాప్ బ్యూటీ కత్రిన కైఫ్ సైతం ఈ ఫోటో పై స్పందిస్తూ… కొన్ని లాఫింగ్ ఈమోజీల్ని షేర్ చేసింది. భారత్ చిత్రంలో కత్రిన – సునీల్ గ్రోవర్ కలిసి నటించిన సంగతి తెలిసిందే. అలాగే కమెడియన్ గౌరవ్ గెరా.. నిర్మాత అతుల్ అగ్నిహోత్రి కూడా ఆ మార్ఫ్ డ్ ఫోటోపై కామెంట్లు పోస్ట్ చేశారు. సునీల్ గ్రోవర్ పేరు ఇంతకు ముందు రకరకాల వివాదాల తోనూ పాపులరైంది. ప్రఖ్యాత కపిల్ శర్మ టాక్ షోతో సునీల్ గ్రోవర్ పాపులరయ్యారు. ఆ తర్వాత కపిల్ శర్మతో ఘర్షణ పడి అతడు ఆ షోకి దూరమైన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer