గుండెపోటుతో తెలుగు హీరో మృతి

0

పరారే పరారు.. ఫ్రెండ్స్ బుక్ తో పాటు తమిళం లో పలు చిత్రాల్లో నటించిన యంగ్ హీరో నందూరి ఉదయ్ కిరణ్ కు శుక్రవారం రాత్రి సమయంలో గుండె పోటు రావడంతో కాకినాడ ప్రభుత్వ హాస్పిటల్ లో జాయిన్ చేశారు. ఆయన చికిత్స పొందుతూ కన్నుమూశాడు. 34 ఏళ్ల నందూరి ఉదయ్ కిరణ్ ఈమద్య కాలంలో సినిమాల్లో ఆఫర్లు లేకపోవడంతో కాకినాడ వెళ్లి పోయి అక్కడే వ్యాపారాలు చూసుకుంటున్నాడు.

హఠాత్తు గా ఉదయ్ కిరణ్ కు గుండె పోటు రావడంతో కుటుంబ సభ్యులు హాస్పిటల్ కు తరలించినా కూడా ఫలితం లేకుండా పోయింది. నేడు ఆయన అంత్యక్రియలను స్వస్థలం రామారావు పేట లో నిర్వహించబోతున్నారు. ఉదయ్ కిరణ్ మృతి పట్ల ఆయన సన్నిహితులు మరియు సినీ ఇండస్ట్రీ లో ఆయనకు పరిచయం ఉన్న వారు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. సినిమా పరిశ్రమ కు చెందిన పలువురు ఆయన ఆత్మకు శాంతి కగాలని కోరుకుంటూ శ్రద్దాంజలి ఘటించారు.
Please Read Disclaimer