‘ఓటిటి’ ప్రారంభించనున్న రాజా రవీంద్ర.. ప్రకటన విడుదల!

0

కరోనా కారణంగా సినీ ఇండస్ట్రీ ఇబ్బందులు ఎదుర్కొంటుంది. ఎక్కడి సినిమాలు అక్కడే నిలిచిపోయాయి. ఇప్పట్లో షూటింగ్స్ జరిగే పరిస్థితి లేదు. షూటింగ్ జరిపే ఆలోచనలో దర్శక నిర్మాతలు లేరు. మెల్లగా ఎలాగోలా షూటింగ్ లాగిచేద్దాం అంటే మహమ్మారి వ్యాప్తి ఘోరంగా పెరిగిపోతుంది. అందుకే సినీ ప్రముఖులు.. హీరోహీరోయిన్స్ అంత కూడా భయపడిపోతున్నారు. ఇప్పటికే విడుదలకు సిద్ధమైన సినిమాలు థియేటర్లలోకి వచ్చేలా లేవు. నిజానికి థియేటర్లు ఎప్పుడు తెరచుకుంటాయో కూడా తెలియని పరిస్థితి. విడుదలకు సిద్ధమైన సినిమాల నిర్మాతలు ప్రస్తుతం ఓటిటిల మీద పడుతున్నారు. థియేటర్లు తెరిచే వరకు వెయిట్ చేయలేని వారంతా ఓటీటీలకు అమ్మేస్తున్నారు. ఇటీవల టీవీ సీరియల్స్ ప్రారంభమై ఓ నటుడికి కరోనా వైరస్ సోకడంతో టీవీ ఇండస్ట్రీతో పాటు సినీ ఇండస్ట్రీ కూడా వణికిపోతోంది.

దీంతో సినిమా షూటింగ్లకు బ్రేక్ ఇచ్చినట్టు తెలుస్తోంది. బడా డైరెక్టర్లే.. షూటింగ్ చేయడానికి భయపడుతున్నాడంటే పరిస్థితి ఎంత దారుణంగా తయారైందో అర్థం చేసుకోవచ్చు. ఇదిలా ఉండగా.. సినిమాలను నమ్ముకోవడం కంటే ప్రస్తుతం ఓటీటీ ప్లాట్ ఫామ్ లను నమ్ముకోవడం మంచిదని కొందరు భావిస్తున్నారు. కొంత మంది ఓటీటీలకు వెబ్ సిరీస్లు చేయడానికి ముందుకొస్తున్నారు. కొంత మంది ఏకంగా ఓటీటీలనే ఓపెన్ చేస్తున్నారు. తాజాగా నటుడు రాజా రవీంద్ర కొత్తగా ఓటీటీని ప్రారంభిస్తున్నట్టు ప్రకటించాడు. తన ఓటిటికి కంటెంట్ కావాలని.. రెడీగా కంటెంట్ ఉంటే తమని 9866661111 నెంబరుకి సంప్రదించవచ్చని అన్నాడు. ఇక వెబ్ సిరీస్.. వెబ్ ఫిల్మ్.. చివరికి షార్ట్ ఫిల్మ్ అయినా కంటెంట్ కొత్తగా వుంటే చాలని తమని సంప్రదించవచ్చని ప్రకటించారు. ఆల్ జోనర్స్కి సంబంధించిన కంటెంట్ని తీసుకుంటామని.. కొత్తగా వెబ్ సిరీస్ కథలు ఉన్నా సరే తమని సంప్రదించండని ఈ వాట్సాప్ నంబర్ని వెల్లడించారు. ప్రస్తుతం యువ డైరెక్టర్లు.. రచయితలు సిద్ధం అవుతున్నారట.
Please Read Disclaimer