ప్రముఖ నటుడు రావి కొండల రావు మృతి

0

ఈ ఏడాది సినిమా పరిశ్రమకు ఏమాత్రం బాగున్నట్లుగా లేదు. పలువురు సినీ ప్రముఖులను ఈ సంవత్సరంలో మృత్యువాత పడుతున్నారు. నేడు టాలీవుడ్ సీనియర్ నటుడు రావి కొండల రావు కన్నుమూశారు. 88 ఏళ్ల ఈ సీనియర్ నటుడు బేగంపేటలోని ఒక ప్రైవేట్ ఆసుపత్రిలో గత కొన్ని రోజులుగా అనారోగ్యంతో చికిత్స పొందుతూ మృతి చెందారు. 600 సినిమాలకు పైగా నటించిన ఈయన టాలీవుడ్ లో తనదైన ముద్ర వేశారు.

నటుడిగానే కాకుండా రచయితగా కూడా రావి కొండల రావు సినిమా పరిశ్రమకు సేవలు అందించారు. తేనే మనసులు.. దసరా బుల్లోడు.. ఎదురింటి మొగుడు పక్కింటి పెళ్లాం.. రాధాగోపాలం చిత్రంతో పాటు ఇంకా పలు చిత్రాల్లో నటించారు. 1958లో సినీ ప్రస్థానంను మొదలు పెట్టిన రావి కొండల రావు జర్నలిస్టుగా దర్శకుడిగా నిర్మాతగా కూడా తనదైన ముద్రను వేశారు.

ఇక రావి కొండల రావు భార్య రాధాకుమారి కూడా నటిగా మెప్పించారు. ఆమె పలు చిత్రాల్లో నటించారు. రావి కొండల రావు మృతితో టాలీవుడ్ సినీ ప్రముఖులు తీవ్ర దిగ్బ్రాంతిని వ్యక్తం చేశారు. ఆయన ఆత్మకు శాంతి చేకూరాలంటూ ప్రార్థిస్తూ సోషల్ మీడియాలో పోస్ట్ లు పెట్టారు.