ప్రముఖ నటుడి కుటుంబంలో కరోనా

0

కరోనా వైరస్ అందరి జీవితాలను చిన్నాభిన్నం చేస్తోంది. ఆర్థిక వ్యవస్థలను కుప్పకూలుస్తోంది. లాక్ డౌన్ ఉన్నన్నీ నాళ్లు తక్కువగా సోకిన మహమ్మారి ఇప్పుడు సడలింపులతో విచ్చలవిడిగా అందరికీ వ్యాపిస్తోంది. తాజాగా చిత్రపరిశ్రమకు కూడా కరోనా సోకింది. బిగ్ బాస్ లో కంటెస్టెంట్ గా చేరిన ప్రముఖ నటుడు సామ్రాట్ సోదరి శిల్పారెడ్డికి కరోనా పాజిటివ్ గా తేలింది. శిల్పారెడ్డి సినీ అభిమానులకు సుపరిచితమే. మోడల్ న్యూట్రిషనిస్ట్ ఫ్యాషన్ డిజైనర్ గా సినీ పరిశ్రమలో గుర్తింపు పొందింది.

15రోజుల క్రితం ఓ ఫ్యామిలీ ఫ్రెండ్ ఇంటికి శిల్పారెడ్డి వెళ్లి వచ్చారు. ఈ తర్వాత ఐదురోజులకు పరీక్షలు చేయించుకోగా కరోనా పాజిటివ్ గా తేలినట్లు తెలిపింది. తనతోపాటు తన భర్తకు కూడా వచ్చిందని.. అయితే లక్షణాలు కనిపించలేదని వివరించింది. ప్రస్తుతం క్వారంటైన్ లో ఉంటూ చికిత్ప తీసుకుంటున్నట్లు వెల్లడించింది.

కరోనా బారిన పడ్డా ఆందోళన చెందాల్సిన అవసరం లేదని.. అందరూ రోగనిరోధక శక్తి పెంచుకోవాలని శిల్పారెడ్డి ఓ సెల్ఫీ వీడియో విడుదల చేశారు.
Please Read Disclaimer