క్యాన్సర్ తో నటి మృతి.. చివరి పోస్ట్ వైరల్

0

మిస్ యూనివర్స్ కంటెస్టెంట్ ప్రముఖ టీవీ నటి దివ్యా చౌక్సీ క్యాన్సర్ తో పోరాడుతూ కన్నుమూశారు. కొద్దిరోజులుగా క్యాన్సర్ తో పోరాడుతున్న ఆమెను ఆ వ్యాధి కబళించింది. ఆదివారం దివ్యా చౌక్సీ మరణవార్తను విన్న బాలీవుడ్ షాక్ అయ్యింది. నెటిజన్లు ఆమెను గుర్తు చేసుకొని నివాళులర్పించారు. కాగా చనిపోవడానికి కొన్ని గంటల ముందు దివ్యా చౌక్సీ తన చివరి పోస్టును ఇన్ స్టాగ్రామ్ లో పోస్ట్ చేసింది. అదిప్పుడు అందరినీ కంటతపడి పెట్టిస్తోంది.

క్యాన్సర్ తో పోరాడుతాను తాను కొన్ని నెలలుగా మెసేజ్ లు పెట్టడం లేదని.. ఇక నా డెత్ బెడ్ మీద ఉన్నా ఏమైనా జరగొచ్చని.. అయినా నేను ధైర్యంగానే ఉన్నానని దివ్యా తెలిపింది. మరో జన్మ ఉంటే ఇలాంటి ఇబ్బంది లేకుండా ఉండాలని కోరుకుంటున్నా.. నన్ను ఏం ప్రశ్నించకండి ప్లీజ్.. బై’ అంటూ వేడుకుంది.

ఆమె చివరి పోస్ట్ ఇప్పుడు అందరినీ ఎమోషన్ కు గురిచేసింది. ఆమెతో కలిసి నటించిన సహా నటులంతా దివ్యా ఆత్మకు శాంతి చేకూరాలని సంతాపం తెలిపారు. ఇలా బాలీవుడ్ లో వరుసగా మరణాలు అందరినీ కలిచివేస్తున్నాయి.