సినీ ఇండస్ట్రీలో మరో విషాదం.. ప్రముఖ కమెడియన్ కన్నుమూత

0

సినీ పరిశ్రమలో చోటు చేసుకుంటున్న వరుస విషాదాలు ప్రేక్షకులను కలవరపెడుతున్నాయి. బాలీవుడ్, కోలీవుడ్, టాలీవుడ్ నుంచి సినీ ప్రముఖుల వరుస మరణ వార్తలు విని షాక్ అవుతున్నారు జనం. గురువారం రోజు ప్రముఖ తమిళ సినీ హాస్యనటుడు వడివేలు బాలాజీ (45) గుండెపోటుతో కన్నుమూశారు. గత 15 రోజుల క్రితం తీవ్ర అనారోగ్యంతో చెన్నైలోని గవర్నమెంట్ ఆసుపత్రిలో చేరిన ఆయన.. చికిత్స పొందుతూ గురువారం సాయంత్రం మృతి చెందారు.

వడివేలు బాలాజీ ఆరోగ్య పరిస్థితి బాగాలేక పోవడంతో ముందుగా ప్రైవేట్ ఆసుపత్రిలో చేర్చిన కుటుంబ సభ్యులు ఆర్ధిక ఇబ్బందుల కారణంగా ప్రభుత్వ ఆసుపత్రికి తరలించి చికిత్స చేయించారు. 10 రోజులకు పైగా ప్రభుత్వ ఆసుపత్రిలో చికిత్స పొందుతూ ఆరోగ్య పరిస్థితి మరీ విషమించడంతో హార్ట్ అటాక్ వచ్చి నిన్న కన్నుమూశారు. దీంతో కోలీవుడ్ వర్గాల్లో విషాద ఛాయలు అలుముకున్నాయి. ధనుష్, ప్రసన్న, ఐశ్వర్య రాజేష్, వివేక్ సహా పలువురు కోలీవుడ్ స్టార్స్ ఆయన మృతి పట్ల సంతాపం తెలిపారు.

విజయ్‌ టీవీలో ప్రసారమవుతున్న ‘కలక్క పోవదు యార్’‌ కార్యక్రమం ద్వారా వడివేలు బాలాజీ ఫేమస్ అయ్యారు. పలు టీవీ కార్యక్రమాల్లో వినోదం పండించిన ఆయన ఆ తర్వాత పలు తమిళ సినిమాల్లోనూ నడిచారు. న టుడు వడివేలును అనుకరిస్తూ కామెడీ చేయడంతో ఆయనకు వడివేలు బాలాజీ అనే పేరు వచ్చింది. ఆయనకు భార్య, ఓ కుమార్తె, కుమారుడు ఉన్నారు.