విజయ్ పారితోషికం వింటే గుండె ఝల్లుమనాలి!

0

ఇలయదళపతి విజయ్ తమిళంలో ఎదురేలేని స్టార్. రజనీ- అజిత్ తరహాలో అత్యంత భారీ ఫాలోయింగ్ ఉన్న హీరో. సినిమా యావరేజ్ అన్న టాక్ వచ్చినా ఈజీగా వంద కోట్ల వసూళ్ళని రాబడతాయి. దళపతికి ఉన్న ఇమేజ్ అలాంటిది. కోలీవుడ్ తోపాటు తెలుగులోనూ ఇటీవల మార్కెట్ ని పెంచుకునే పనిలో ఉన్నాడు విజయ్. తను నటించిన ప్రతి సినిమా తెలుగులోనూ విడుదలవుతున్నాయి. ప్రస్తుతం ఆయన `మాస్టర్` చిత్రం లో నటిస్తున్నారు. యాక్షన్ థ్రిల్లర్ గా రూపొందుతున్న ఈ సినిమాకి `ఖైదీ` ఫేమ్ లోకేష్ కనగరాజ్ దర్శకత్వం వహిస్తున్నారు. విజయ్ సేతుపతి విలన్ గా నటిస్తుండగా.. విజయ్ సరసన మాళవిక మోహనన్ రొమాన్స్ చేయనుంది. చిత్రీకరణ పూర్తయింది. ఏప్రిల్ 9న సినిమా విడుదల కానుంది.

ఇదిలా ఉంటే విజయ్ ఇంటిపై ఇటీవల వరుసగా ఐటీ అధికారులు దాడులు చేయడం కలకలం రేపిన సంగతి తెలిసిందే. తన ఇంటిపైనా.. ఆఫీసుపైనా.. అలాగే నిర్మాతల ఆఫీసులపైనా దాడులు నిర్వహించి సోదాలు చేశారు. సినిమా విడుదల ముందు ఇలాంటి ఐటీ దాడులు కామనే అనుకున్నా .. ఆ సమయంలోనే అధికారులు తమ కలెక్షన్లని వసూలు చేసుకుని వెళ్తుంటారనే నానుడి ఉంది. అయితే విజయ్ ఇంటిపై ఈ సోదాలకు ఓ ప్రత్యేక కారణముంది. అదే ఆయన తీసుకునే రెమ్యూనరేషన్. ఆయన `మాస్టర్` చిత్రానికి ఏకంగా రూ.80కోట్లు పారితోషికం గా తీసుకున్నారట. ఈ వార్త వింటే గుండె ఝల్లుమనాల్సిందే. ఇంత భారీ భారీపారితోషికం తీసుకున్ననేపథ్యం లో ఆ వార్త తెలిసి ఐటీ అధికారులు దాడులు నిర్వహించారట.

విజయ్ పై ఇలా దాడులు నిర్వహించడం పై ఆయన అభిమానులు మండిపడిన సంగతి తెలసిందే. దీనికి రకరకాల రాజకీయ కారణాలున్నాయని ఆరోపించారు. రజనీకాంత్ వంటి హీరోపై ఇలాంటి దాడులు నిర్వహించగలరా అని అటు అభిమానులు.. ఇటు విజయ్ కూడా ఐటీ అధికారులను ప్రశ్నించిన విషయం విదితమే. అయితే విజయ్ నటించిన గత చిత్రం ` విజిల్` డివైట్ టాక్ వచ్చినా బాక్సాఫీసు వద్ద భారీ కలెక్షన్లని రాబట్టి నిర్మాతలు.. బయ్యర్లని సేఫ్ జోన్ లో పడేసింది. దీంతో విజయ్ అడిగిన మొత్తాన్ని ఇచ్చేందుకు నిర్మాతలు కూడా సుముఖంగా ఉండటం విశేషం. మరోవైపు ఈ సినిమాకి తెలుగులో డిమాండ్ తగ్గింది. `విజిల్` తెలుగులో అనుకున్నంతగా ఆడలేక పోవడంతో విడుదల హక్కులను తీసుకునేందుకు ఎవరూ ఆసక్తి చూపటం లేదట.
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-