సూపర్ స్టార్ ను ప్రశ్నించిన ఐటీ అధికారులు

0

సినిమా ఇండస్ట్రీకి చెందిన ప్రముఖ నిర్మాతలు మరియు హీరో హీరోయిన్స్ ఇళ్లపై ఆఫీస్ లపై ఐటీ దాడులు జరగడం అనేది ఈమద్య కాలంలో చాలా కామన్ గా చూస్తూనే ఉన్నాం. ముఖ్యంగా ఏదైనా పెద్ద సినిమా విడుదల సమయంలో ఆయా నిర్మాణ సంస్థలపై ఆ సినిమాలో నటించిన హీరోల ఆఫీస్ లపై ఐటీ రైడ్స్ జరుగుతూ ఉంటాయి. కొన్ని రోజుల క్రితం హీరోయిన్ రష్మిక మందన్న తండ్రి ఇంటిపై మరియు ఆఫీస్ పై రైడ్స్ జరిగాయి. ఆ తర్వాత రష్మికను ఐటీ అధికారులు ప్రశ్నించారు.

ఇప్పుడు బిగిల్ చిత్రానికి సంబంధించి కోలీవుడ్ సూపర్ స్టార్ విజయ్ ని ఐటీ అధికారులు ప్రశ్నించారు. అది కూడా ఆయన ప్రస్తుతం నటిస్తున్న ‘మాస్టర్’ చిత్రం కడలూరు జిల్లా నైవేలీలో షూటింగ్ జరుగుతుండగా అక్కడకు వెళ్లి షూటింగ్ గ్యాప్ లో విజయ్ ను ఐటీ అధికారులు బిగిల్ గురించిన ఆర్థిక లావాదేవీలను అడిగి తెలుసుకున్నారట. బిగిల్ చిత్రంను నిర్మించిన ఏజీఎస్ సంస్థ బడ్జెట్ మరియు వసూళ్ల విషయంలో సరైన లెక్కలు చూపించలేదంటూ ఐటీ అధికారులకు ఫిర్యాదు అందిందట.

ఐటీ అధికారులు ఏజీఎస్ సంస్థకు సంబంధించిన ఆఫీస్ల పై ఐటీ రైట్స్ నిర్వహించడంతో పాటు దర్శకుడు మరియు హీరోలను కూడా ఈ విషయమై ప్రశ్నించారు. అందులో భాగంగానే మాస్టర్ సెట్స్లో ఉన్న విజయ్ ను ఐటీ అధికారులు స్వయంగా కలిసి దాదాపుగా గంట పాటు బిగిల్ చిత్రం బడ్జెట్ మరియు ఇతరత్ర విషయాలపై ఆరా తీసినట్లుగా సమాచారం అందుతోంది.
Please Read Disclaimer