ఈమెకు పెళ్లిపై మరీ ఇంతలా విరక్తి ఎందుకో?

0

తమిళ మీడియాలో వరలక్ష్మి విశాల్ ల ప్రేమ పెళ్లి గురించి ఎప్పటికప్పుడు వార్తలు వస్తూనే ఉన్నాయి. వాటిని వారిద్దరు కూడా కొట్టి పారేస్తూనే ఉన్నారు. తాజాగా మరోసారి కూడా తమ పెళ్లి గురించి మీడియాలో వస్తున్న వార్తల పై వరలక్ష్మి మరియు విశాల్ లు క్లారిటీ ఇచ్చారు. తామిద్దరం ప్రేమలో లేమని తేల్చి చెప్పారు. వరలక్ష్మి తాజాగా సర్కార్ చిత్రంలో నటించిన విషయం తెల్సిందే. ఆ చిత్రం ప్రమోషన్ లో భాగంగా వరలక్ష్మి పెళ్లి పై తన అభిప్రాయంను చెప్పి అందరిని ఆశ్చర్యపర్చింది.

వరలక్ష్మి మాట్లాడుతూ.. ఒక మహిళకు పెళ్లి అనేది లక్ష్యం కాకూడదు. రాజకీయం లేదంటే ప్రజలకు మంచి చేయాలనేది లక్ష్యంగా పెట్టుకోవాలి. జీవితంలో ఏదైనా సాధించాలనుకోవాలి కాని పెళ్లి చేసుకోవడమే లక్ష్యంగా బతకకూడదు అంటూ వరలక్ష్మి చెప్పుకొచ్చింది. పెళ్లి చేసుకుంటే ఎవరికి ఉపయోగం అసలు ఎందుకు పెళ్లి అంటూ రివర్స్ ప్రశ్నలు సంధించింది. సల్మాన్ ఖాన్ ఇప్పటి వరకు పెళ్లి చేసుకోలేదు. ఆయన్ను పెళ్లి ఎందుకు చేసుకోలేదు అంటూ ప్రశ్నించనప్పుడు అమ్మాయిలను ఎందుకు పెళ్లి ఎందుకు చేసుకోవు అని ప్రశ్నిస్తారు అంది.

నా జీవితంలో మగాడు అవసరం లేదనిపిస్తోంది. నేను ఒంటరిగానే జీవితాన్ని సాగించగలను అనే నమ్మకం ఉందని వరలక్ష్మి చెప్పింది. ప్రేమించడం తప్పు కాదు కాని ప్రేమించిన వ్యక్తిని పెళ్లి చేసుకుని జీవితాంతం ఉండటం లేదు. జీవితాంతం ఉండాలనుకున్నప్పుడు పెళ్లి చేసుకోవడంలో తప్పులేదు. పెళ్లి చేసుకున్న తర్వాత మగాళ్లు ఉద్యోగాలు మానెయ్యరు. కాని అమ్మాయిలు మాత్రం చేసే ఉద్యోగాలు మానేయాలి ఇంకా చాలా విషయాల్లో త్యాగం చేయాల్సి ఉంటుంది. అందుకే పెళ్లి విషయంలో తనకు పెద్దగా ఆసక్తి లేదని పెళ్లి చేసుకోకుండానే జీవితాన్ని గడిపేస్తానంటూ వరలక్ష్మి చెప్పింది.

పెళ్లి పై వరలక్ష్మికి మరీ ఇంతలా విరక్తి ఏంటా అంటూ సినీ వర్గాల్లో మరియు మీడియా వర్గాల్లో చర్చ జరుగుతుంది. పెళ్లి పై ఆసక్తి లేదని చెప్పిన వరలక్ష్మి భవిష్యత్తులో అయినా పెళ్లి పీఠలు ఎక్కకుండా ఉంటుందా అనేది చూడాలి.
Please Read Disclaimer