`ఐ లవ్ యు` సరే.. పెళ్లెప్పుడు ఆలియా?

0

బాలీవుడ్ రైజింగ్ స్టార్ ఆలియాభట్ గత కొంతకాలంగా `బ్రహ్మాస్త్ర` కోస్టార్ రణబీర్ కపూర్ తో ప్రేమలో ఉందని ప్రచారం సాగుతోంది. ఈ ఏడాది ఈ జంట పెళ్లి చేసుకోబోతున్నారని మీడియా కోడై కూస్తోంది. ఆలియా లవ్ మ్యాటర్ గురించి డాడ్ మహేష్ భట్ నే ప్రశ్నిస్తే `పెళ్లి వరకూ వెళితే చూద్దాం!` అంటూ లైట్ తీస్కున్నారు. అయితే సన్నివేశం చూస్తుంటే అలా కనిపించడం లేదు. ఆలియా నిండా ప్రేమలో మునిగి ఉంది. రణబీర్ ని వీడి ఒక్క క్షణమైనా ఉండలేనంత ప్రేమలో ఉందని తాజా సన్నివేశం చెబుతోంది.

అందుకు తాజా నిదర్శమిదే. నిన్నటి సాయంత్రం ముంబైలో జరిగిన ఫిలింఫేర్ అవార్డుల వేడుకలో రణబీర్ని ఉద్ధేశించి ఆలియా ఎమోషన్ అయిన తీరు అభిమానుల్లో ప్రముఖంగా చర్చకు వచ్చింది. రాజీ చిత్రంలో పెర్ఫామెన్స్ కి ఉత్తమ కథానాయికగా అవార్డ్ అందుకున్న ఆలియా భట్ అవార్డు షీల్డ్ అందుకున్న అనంతరం వేదికపైనే రణబీర్ పై తనకు ఎంత ప్రేమ ఉందో పబ్లిగ్గానే ప్రకటించింది. ‘ఈ అవార్డ్ నా దర్శకురాలు మేఘన గుల్జార్ కి చెందుతుంది. ఆమె నా ప్రధానమైన చిక్. విక్కీ .. నువ్వు లేకుండా ఈ సినిమా పరిపూర్ణం కానేకాదు. థాంక్యూ.. నా మెంటార్ .. డాడ్ .. ఫ్యాషన్ పోలీస్ కరణ్ జోహార్ కి ధన్యవాదాలు. ఈ రేయి అంతా ప్రేమ గురించే.. దేర్ మై స్పెషల్ వన్.. ఐ లవ్ యు రణబీర్’ అంటూ ఎంతో ఎమోషన్ అయిపోయింది ఆలియా. అవార్డ్ అందుకున్న ఉద్వేగంలో రణబీర్ తో ప్రేమను ఓపెన్ అయిపోయింది. ఆ లెవల్లో ఆ ప్రేమను వ్యక్తం చేస్తుందని ఎవరూ ఊహించలేదు. కానీ ఊహించనిదే జరిగింది. అందుకే ఆలియా వైపు నుంచి క్లియర్ కట్ గా లవ్ గుట్టు లీకైపోయింది.

అయితే భామలతో ప్రేమాయణంలో మహా ముదురు అయిన రణబీర్ వైపు నుంచి పూర్తి క్లారిటీ రావాల్సి ఉందింకా. ఇక రణబీర్ – ఆలియా జంట రొమాన్స్ గురించి నిరంతరం అభిమానుల్లో ఆసక్తికర చర్చ సాగుతూనే ఉంది. ఆ ఇద్దరికీ ఇరు కుటుంబాల నుంచి కావాల్సినంత స్వేచ్ఛ ఉంది. ముంబైలో రణబీర్ నివశించే ఖరీదైన పోష్ ఏరియాలోనే ఆలియా ఓ అపార్ట్ మెంట్ కొనుక్కుంది. ఇక వేరొక అవార్డుల వేడుకలో రణబీర్ – ఆలియా జంట రొమాంటిక్ డ్యాన్స్ పెర్ఫామెన్స్ ఇటీవల హాట్ టాపిక్ గా మారిన సంగతి తెలిసిందే. ప్రస్తుతం ఈ జంట పెళ్లి చేసుకోవడానికి రెడీగా ఉన్నారని అభిమానులు భావిస్తున్నారు. మరోవైపు ఆలియా ఆర్.ఆర్.ఆర్ చిత్రంతో సౌత్ లోనూ అడుగుపెడుతున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer