మిడిల్ ఫింగర్ చూపిస్తున్న క్యూటీ

0

మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారు అంటే దానర్థం ఏమిటి? మీరెంత తోపులైనా మా జోలికి రాలేరు అని మీనింగా? ఏమో ఇక్కడ ఈ వీడియో చూస్తే అలాంటి అర్థమే స్ఫురిస్తోంది. ముఖ్యంగా ఈ గుంపులో ఆర్.ఆర్.ఆర్ బ్యూటీ ఆలియా భట్ వ్యవహారం చూస్తుంటే చాలా తేడాగానే ఉంది. ఇలా ఈ అల్లరి గ్యాంగ్ మ్యూజిక్ ప్లే చేస్తూ .. బోయ్స్ కి మిడిల్ ఫింగర్ చూపిస్తున్నారేమిటో!

బర్త్ డే సెలబ్రేషన్స్ పేరుతో ఆలియా తన సోదరి షహీనా భట్ తో పాటు ఇతర స్నేహితురాళ్లతో ఫుల్ గా చిలౌట్ చేసింది. బికినీ బీచ్ సెలబ్రేషన్స్ తో పాటు.. తనకు నచ్చిన వైన్ అండ్ డైన్ తరహా పార్టీతో జిల్ చిల్ అంటూ బోలెడంత హడావుడి చేసింది. ఇక ఈ వేడుకకు తన బోయ్ ఫ్రెండ్ రణబీర్ ఎందుకనో ఎటెండ్ కాలేకపోయాడు కానీ.. ఒకవేళ వచ్చి ఉంటే ఆ లెక్కే వేరేగా ఉండేది.

అన్నట్టు ఆర్.ఆర్.ఆర్ బ్యూటీగా ఇప్పటికే తెలుగు వారి గుండెల్లో తిష్ఠవేసిన ఆలియాకి సంబంధించిన ఫస్ట్ లుక్ గ్లింప్స్ ఏవీ జక్కన్న రిలీజ్ చేయలేదు ఎందుకనో. ఆలియా భట్ బర్త్ డే రోజు అయినా కనీసం ఒక ఫోటో అయినా రివీల్ చేయాలన్న ఆలోచనే చేయలేదు. ఇంకా సంక్రాంతి వరకూ ఆర్.ఆర్.ఆర్ ని రిలీజ్ చేయలేం అన్న డైలమా వల్లనే జక్కన్న ఇంకా అన్నీ దాచేస్తున్నాడా? ఏదైతేనేం.. జక్కన్నను కూడా పట్టించుకునే పరిస్థితిలో లేదు ఆలియా. ఓన్లీ తన ఫ్రెండ్స్ తో ఫుల్ గా చిలౌట్ చేసే మూడ్ తప్ప ఇంకేదీ కనిపించలేదు. ఇలాంటి టైమ్ లో ఆర్.ఆర్.ఆర్ ప్రమోషన్ చేయాలన్నా వినేట్టే లేదు మరి!! జూలై నుంచి ఆర్నెళ్ల పాటు వాయిదా వేసేయడంతోనే అభిమానుల్లో నీరసం వచ్చేసింది. ఇక చిత్రబృందంలో టాప్ స్టార్లు అయితే మరీ విసిగిపోతున్నారో ఏమిటో!
Please Read Disclaimer


30రూ|| మాస్క్ కేవలం 2రూ|| కే తయారు చేసుకోండి Make your own mask for Just Rs.2/-