హీరోయిన్ అర్చన పెళ్లి తేదీ ఫిక్స్

0

బిగ్ బాస్ తెలుగు సీజన్-1లో అందాల కథానాయిక అర్చన ట్రీట్ ని యూత్ అంత తేలిగ్గా మర్చిపోలేరు. అర్చన గత కొంతకాలంగా జగదీష్ అనే యువకుడితో ప్రేమలో ఉన్న సంగతి విధితమే. తనే స్వయంగా బోయ్ ఫ్రెండ్ ని అందరికీ పరిచయం చేసింది. అతడితో రొమాంటిక్ మూవ్ మెంట్స్ ని ఫేస్ బుక్ ద్వారా ఫ్యాన్స్ కు షేర్ చేసింది. అక్టోబర్ 3న ఈ జంట నిశ్చితార్థం పూర్తయింది. బోయ్ ఫ్రెండ్ జగదీశ్ నిశ్చితార్థపు ఉంగరం తొడుగుతున్న ఫోటోలు అప్పట్లో రివీలయ్యాయి. ఆ వేడుకకు నటుడు శివబాలాజీ సతీమణితో కలిసి కుటుంబ సమేతంగా హాజరయ్యారు. కొద్దిమంది బంధు మిత్రుల సమక్షంలో ఈ వేడుక జరిగింది.

తాజా సమాచారం ప్రకారం అర్చన పెళ్లి తేదీ ఫిక్సయ్యింది. నవంబర్ 13న హైదరాబాద్ లో అర్చన- జగదీష్ జంట వివాహం జరగనుంది. ఓ ప్రయివేటు వెన్యూలో జరగనున్న ఈ వేడుకకు బంధుమిత్రులు సహా పలువురు సినీసెలబ్రిటీలు హాజరు కానున్నారు. ఆ మేరకు తాజాగా మీడియాకు సమాచారం అందింది.

అల్లరి నరేష్ సరసన `నేను` అనే చిత్రంతో కథానాయికగా తెరకు పరిచయం అయిన అర్చన చక్కని క్లాసికల్ డ్యాన్సర్. `యమదొంగ` చిత్రంలో ఓ పాటలో మెరిసింది. యంగ్ టైగర్ హోస్టింగ్ చేసిన బిగ్ బాస్ తెలుగు సీజన్ లో పాల్గొంది. తెలుగు- తమిళం- కన్నడం- మలయాళం చిత్రాల్లో నటించింది. అందం అభినయం ఉన్నా ఎందుకనో కథానాయికగా ఎదగలేకపోయింది.
Please Read Disclaimer