ఆలు మగల గొడవలు పరిష్కరిస్తుందట!

0

ఇటీవలి కాలంలో కాన్సెప్ట్ బేస్డ్ సినిమాలు అంతకంతకు పెరుగుతున్నాయి. ముఖ్యంగా బాలీవుడ్ లో ఈ తరహా సినిమాల వెల్లువ రెట్టింపైంది. బట్టతల కాన్సెప్ట్.. వీర్యదానం కాన్సెప్ట్.. మహిళా విజేతల కాన్సెప్ట్.. ఇలా ఎన్నో వైవిధ్యం ఉన్న కాన్సెప్టులతో సినిమాలు తీసి విజయం అందుకుంటున్నారు. ఈ కోవలోనే భార్యా భర్తల మధ్య గొడవల నేపథ్యంలో ఓ ఇంట్రెస్టింగ్ సినిమా తెరకెక్కుతోంది. `పతి పత్ని ఔర్ వో` అనేది సినిమా టైటిల్. కార్తీక్ ఆర్యన్.. భూమి పెడ్నేకర్- అనన్య పాండే నాయకానాయికలు.

ఇప్పటికే రిలీజైన ట్రైలర్ ఆకట్టుకుంది. ఇక ఇందులో భార్య ఉండగా వేరొక అమ్మాయి జీవితంలో ప్రవేశిస్తే ఏం జరుగుతుంది? అన్న కాన్సెప్టుతో ఆసక్తికరంగా ఈ చిత్రాన్ని రూపొందించారని ట్రైలర్ చెబుతోంది. ఇక ఇందులో భార్య భర్తల మధ్య గొడవలు .. వాటిని పరిష్కరించుకునేందుకు టిప్స్ ఇచ్చే సీన్స్ అలరించనున్నాయట.

ఈ కాన్సెప్టుకు తగ్గట్టే ప్రమోషన్ హీటెక్కిస్తున్నారు. భార్య భర్తలు విడిపోవడానికి చిన్న చిన్న కారణాలే ఎక్కువగా ఉంటున్నాయి. గొడవ చినికి చినికి గాలివాన అవ్వడంతోనే జీవితాలు నాశనం అవుతున్నాయి. భార్యాభర్తల మధ్య ఈ వ్యత్యాసాల్ని తాను తీరుస్తాను అంటూ భూమి ఫెడ్నేకర్ ప్రచారం చేస్తోంది. `వేదిక లవ్ లైన్` పేరుతో ఓ క్యాంపెయిన్ ను ప్రారంభించింది. ఇలాంటి క్యాంపెయిన్ ద్వారా భార్యాభర్తల మధ్య ఉండే చిన్న చిన్న సమస్యలను ఈ ముద్దుగుమ్మ పరిష్కరించాలని అనుకుంటోందట. పబ్లిసిటీకి పబ్లిసిటీ.. పనిలో పనిగా ఒక మంచి సకార్యం చేస్తోంది అమ్మడు. 1978లో రిలీజై విజయం సాధించిన పతి పత్ని ఔర్ వో చిత్రానికి సీక్వెల్ చిత్రమిది. పాత టైటిల్ తోనే సీక్వెల్ సినిమా చేయడం ఆసక్తికరం. అంతా బాగానే ఉంది కానీ.. సినిమా రిలీజ్ అయ్యాక కూడా భూమి ఈ మంచి పనిని కొనసాగిస్తుందో లేదో చూడాలి.Please Read Disclaimer

మీ ఇంటివద్దే ఉచితం గా మాస్క్ తయారు చేసుకోండి ఇలా!? How to Make your own mask at Home