నటి డేటా చోరీ.. జూబ్లీ పోలీస్ ఇన్వెస్టిగేషన్!

0

తన వ్యక్తిగత సమాచారాన్ని దొంగిలించి హాని తలపెట్టారంటూ సినీనటి రాధా ప్రశాంతి (47) జూబ్లీహిల్స్ పోలీసులను ఆశ్రయించడం సంచలనమైంది. తన జీమెయిల్ .. ఫేస్ బుక్ నుంచి కీలకమైన సమాచారాన్ని దొంగిలించారని రాధా ఆరోపించారు. పూర్తి వివరాల్లోకి వెళితే..

47 ఏళ్ల సినీనటి రాధ ప్రశాంతి ఫిలింనగర్ లో నివాసం ఉంటున్నారు. ఆమె వద్దకు మే 13న చీరల డిజైనర్ లక్ష్మి తన కుమారుడు చక్రితో కలిసి వచ్చారు. వాట్సాప్ కు చీరల డిజైన్ లను పంపుతామని రాధ నుంచి ఫోన్ తీసుకున్నారట. అయితే అందులో ఎలాంటి డిజైన్లు కనిపించలేదు.. దాంతో పాట తన జీమెయిల్ లోని కీలక డేటా మాయమయ్యిందని.. అలాగే ఫేస్ బుక్ లోనూ కొన్ని ముఖ్యమైన ఫోటోలు డిలీట్ చేశారని పోలీసులకు రాధా ఫిర్యాదు చేశారు. తన ఐడీ కార్డుల్ని దొంగిలించారని సదరు నటి ఆరోపిస్తున్నారు. ఇదివరకూ లక్ష్మి ఆమె కుమారుడు జీఎస్టీ కార్డు ఇస్తామని చెప్పి మే 14న రూ.25 వేలు తీసుకున్నారని కూడా ఫిర్యాదులో పేర్కొన్నారు.

ప్రస్తుతం నటి రాధ ఫిర్యాదు మేరకు లక్ష్మి ఆమె కుమారుడు చక్రిపై జూబ్లీహిల్స్ పోలీసులు కేసు నమోదు చేసి దర్యాప్తు చేస్తున్నారు. నిందితులపై పోలీసులు ఐపీసీ సెక్షన్లు 420 406 రెడ్ విత్ 34 పరిధి కింద కేసులు నమోదు చేసి ఇన్వెస్టిగేషన్ ప్రారంభించారు. ఒకరి వ్యక్తిగత సమచారాన్ని తస్కరించడం తీవ్రమైన నేరం. కీలకమైన ఐడీ కార్డులు.. ఫోటోలు లేదా ఇంకేదైనా వ్యక్తిగత సమాచారం దొంగిలిస్తే సైబర్ నేరగాళ్లుగా పరిగణించి కఠినంగా శిక్షిస్తున్న సంగతి తెలిసిందే.
Please Read Disclaimer