‘ఫ్యాన్స్‌ను హర్ట్ చేయకు దుస్తులు విప్పేయ్ అన్నారు’

0

అమెరికన్ టెలివిజన్ డ్రామా సిరీస్ ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ప్రపంచ వ్యాప్తంగా ఎంత పాపులర్ అయిందో అందరికీ తెలిసిందే. ఈ ఒక్క షో వల్ల ఇందులో నటించినవారికి హాలీవుడ్ స్టార్లకు కంటే రెట్టింపు పాపులారిటీ దక్కింది. ఈ సిరీస్‌లో నటించినవారిలో ఎమీలియా క్లార్క్ అనే నటి కూడా ఉన్నారు. తాను కీలక పాత్రలో నటించిన ఈ షో హిట్ అయినందుకు సంతోషంగా ఉన్నప్పటికీ తన చేత బలవంతంగా నగ్న సన్నివేశాల్లో నటింపజేసినందుకు బాధపడ్డానని తెలిపారు.

ఈ విషయాన్ని ‘ఆర్మ్ ఛైర్ ఎక్స్‌పర్ట్’ అనే షోలో ఎమీలియా వెల్లడించారు. ‘అవసరం లేని చోట నా చేత దుస్తులన్నీ విప్పించారు. సెట్‌లో ఈ విషయంలో రోజూ నాకు డైరెక్టర్స్‌కి మధ్య గొడవలు జరుగుతుండేవి. దుస్తులు విప్పనని నేను లేదు విప్పాల్సిందేనని డైరెక్టర్స్ వాదులాడుకునేవాళ్లం. నేను నగ్న సన్నివేశాల్లో నటించకపోతే ఫ్యాన్స్ బాధపడతారని చెప్పేవారు. దాంతో ఆ సన్నివేశాల్లో నటించేటప్పుడు ఇబ్బందికరంగా అనిపించేది. ఎందుకంటే అసలు ఆ సన్నివేశాల్లో నటించడానికి దుస్తులు విప్పాల్సిన అవసరం అస్సలు లేదు. కానీ ఎందుకు నాచేత అలా చేయించారో వారికే తెలియాలి. అలా నేను ‘గేమ్ ఆఫ్ థ్రోన్స్’ ఫస్ట్ సీజన్‌లో నేను చాలా నగ్న సన్నివేశాల్లో నటించాను’

‘చెప్పినట్లుగా చేస్తున్నాను కదా అని రాను రాను అవే సీన్లలో నటించమనేవారు. దాంతో నాకు కోపం కట్టలు తెంచుకునేది. ఇదివరకు ఎప్పుడూ నేను ఇలాంటి సన్నివేశాల్లో నటించింది లేదు. అసలు నా నుంచి డైరెక్టర్స్ ఏం కోరుకుంటున్నారో తెలిసేది కాదు. ఎందుకు అందరి ముందు నగ్నంగా నిలబడ్డానో తెలిసేది కాదు. ఈ విషయం గురించి నా కోస్టార్ జేసన్ మొమోవాకు చెప్పాను. నీకు ఇష్టం లేనప్పుడు గట్టిగా అడిగేయ్ అని నాకు ధైర్యం చెప్పారు. నేను న్యూడ్ సన్నివేశాల్లో నటించాల్సిన అవసరం ఉందో లేదో తెలీదు కానీ అసలు నేను ఈ షోలో ఎందుకు నటిస్తున్నానో కూడా తెలిసేది కాదు’ అంటూ బాధపడ్డారు ఎమీలియా.