హీరోయిన్‌ను మోయలేక.. ఆ హీరో ఏం చేశాడో చూడండి, నవ్విస్తున్న వీడియో!

0

సినిమా షూటింగులను చూస్తే భలే ఫన్నీగా అనిపిస్తాయి. కొన్ని సన్నివేశాలను రక్తికట్టించడానికి నటీనటులు పడే శ్రమను చూస్తే అయ్యో పాపం అనిపిస్తుంది. ఈ చైనా సినిమా షూటింగ్ చూస్తున్నప్పుడు కూడా మీకు అదే అనిపిస్తుంది. కానీ, అది చూస్తున్నంతసేపు మీరు నవ్వుతూనే ఉంటారు.

లి ల్యాండీ, జిన్ యున్లాయ్ నటించిన ‘Dreaming Back to the Qing Dynasty’ సినిమాలో ఓ సన్నివేశం సోషల్ మీడియాలో వైరల్‌గా మారింది. ఇందులో హీరో లి.. హీరోయిన్ జిన్‌ను మోసుకుంటూ నడవాలి. అయితే, అతడు ఆమెను ఎత్తుకోడానికి ముప్పుతిప్పలు పడ్డాడు. ఆమె లావుగా, బరువు ఎక్కువగా ఉండటం వల్ల అతడు చాలా కష్టంగా మోశాడు. దీంతో షూటింగ్ స్పాట్‌లో నవ్వులు విరిశాయి.

చేసేది ఏమీలేక.. షూటింగ్ సిబ్బంది ఆమెను నిచ్చెనపై కుర్చోబెట్టి, హీరో మోసుకుంటూ వెళ్తున్నట్లుగా క్లోజప్‌ షాట్లు చిత్రీకరించారు. దీనికి సంబంధించిన బిహైండ్ ది సీన్స్ వీడియోను చిత్ర యూనిట్ ఇటీవల విడుదల చేశారు. ఈ వీడియోను కొందరు చైనా సోషల్ మీడియా సైటు ‘విబో’లో పోస్టు చేశారు. అంతే.. ఆ వీడియో క్షణాల్లో వైరల్‌గా మారింది. అయితే, ఈ వీడియోను ‘సరదా’గా చూడాల్సిన జనం.. హీరోయిన్‌పై బాడీ షేమింగ్‌కు పాల్పడటం విచారకరం. లావుగా ఉన్నావంటూ ఆమెను హేళన చేస్తున్నారు. కొందరు మాత్రం.. ఆమె 50 కిలోలు మించి బరువు ఉండకపోవచ్చని, హీరో మరీ బలహీనంగా ఉండి ఉంటాడని పేర్కొంటున్నారు.

వీడియో:
Please Read Disclaimer