సినిమాటోగ్రాఫర్ కి పెర్ ఫ్యూమ్ కొనిచ్చిన బ్యూటీ

0

సీనియర్ ఛాయాగ్రాహకుడు ఛోటా.కె. నాయుడు సెట్ లో చేసే హడావుడి అంతా ఇంతా కాదు. ఒక సీనియర్ గా దర్శకుడితో సమానంగా గౌరవం అందుకుంటున్నారు ఆయన. ఆయన డెడికేషన్ కి పెట్టింది పేరు అని దర్శకులు చెబుతారు. ఇండస్ట్రీలో ఈ సీనియర్ పనితనాన్ని మెచ్చని హీరోనే ఉండరు. నిర్మాతలకు డార్లింగ్ సినిమాటోగ్రాఫర్. సెట్స్ లో తను అందరితో ఎంతో జోవియల్ గా ఉంటారు. ఎంతో ఆరోగ్యకరమైన వాతావరణాన్ని క్రియేట్ చేస్తారని నిర్మాతలు చెబుతారు. ఛోటా. కె ఎనర్జీ చూసి హీరోయిన్లు సైతం ఎంతో ముచ్చట పడుతుంటారు. ఆ మధ్య ఓ మీడియా సమావేశంలోనే చందమామ కాజల్ అగర్వాల్ ను బుగ్గపై ముద్దు పెట్టి ఎంత సంచలనం అయ్యాడో తెలిసిందే. స్నేహంతో ఎగ్జయిట్ అయ్యి ఆ మూవ్ మెంట్ లో అలా జరిగిపోయింది ఆ ఘటన.

ఆ తర్వాత ఓ ఇంటర్వ్యూలో కాజల్ తనకు తానుగానే ఛోటా.కె తో స్నేహం గురించి చెప్పుకొచ్చింది. ఛోటా కే తన నాయికలతో ఎంతో సరదాగా.. చనువుగా ఉంటారు అని చెప్పిన కాజల్ ఆయనలో మరో యాంగిల్ కూడా ఉందని తెలిపారు. సెట్ లో ఆయన చెప్పినట్లు వినకపోతే ఎవరిపై అయినా శివతాండం అడేస్తారని వెల్లడించింది. ఆ లక్షణం తొలి నుంచి ఆయనకు ఉందిట. సీనియర్.. జూనియర్ అనే తేడా లేకుండా ఆర్టిస్టు తను చెప్పిన టైమ్ కి రాకపోతే సీరియస్ అవుతారట.

అప్పట్లో రామానాయుడు స్టూడియోలో ఓ మూవీ షూట్ చేస్తున్నారు. ఆ మూవీ హీరోయిన్ పై తెల్లవారు ఝామున 5 గంటలకు సన్నివేశాలు షూట్ చేయాల్సి ఉంది. అందుకు ఛోటాకె చాలా ముందుగా ప్రిపేరయ్యారు. తన అసిస్టెంట్ల బృందంతో చాలా ముందుగానే లొకేషన్ కి చేరుకుని అంతా సిద్ధం చేసి పెట్టాడుట. కానీ హీరోయిన్ ధీమాగా సెట్ కి 6.30కి వచ్చింది. దీంతో కోపగించుకున్న ఆయన ఆ హీరోయిన్ కి షూటింగ్ క్యాన్సిల్ చేశామని.. తర్వాతి రోజు రావాలని చెప్పాడట. ఆ సమయంలో ఎగ్జిక్యుటివ్ నిర్మాత తనని వారించాలని చూసినా పట్టించుకోలేదు. ఆ విషయం తెలిసీ నిర్మాత కూడా ఛోటా.కె కే సపోర్ట్ చేశారట. అయితే తనకు సపరేట్ హోటల్ బుక్ చేయడం వల్లనే సమస్య వచ్చిందని గ్రహించిన ఆ హీరోయిన్ నేరుగా ఛోటా.కెకి సారీ చెప్పి ఖరీదైన పెర్ ప్యూమ్ కొనిచ్చి కూల్ చేసిందిట. సెంటు కోసం కాకపోయినా బతిమాలిన విధానం నచ్చి కూల్ అయ్యారట గురుడు. ఆయన స్వభావం తొలి నుంచి ఇంతే. తాను పని చేసిన మొదటి సినిమా `అమ్మ రాజీనామా` విషయంలోనూ కళా దర్శకుడు తను చెప్పినట్లు చేయకపోవడం వల్ల కోపం కట్టలు తెచ్చుకోవడంతో పెద్ద గడబిడ అయ్యిందట. ఆ సంగతిని ఛోటా కెనే స్వయంగా తెలిపాడు.
Please Read Disclaimer