స్మార్ట్ శంకర్ కు మాస్ భామల మసాలా

0

వచ్చే వారం విడుదలకు రెడీ అవుతున్న ఇస్మార్ట్ శంకర్ మీద రామ్ చాలా ఎగ్జైటింగ్ గా ఉన్నాడు. అది ఏ స్థాయిలో ఉందో నిన్న పెట్టిన ట్వీట్ లో ఫ్యాన్స్ కు అర్థమైపోయింది. ఎన్నడూ లేనిది సామాన్యంగా సినిమాల్లో మాత్రమే వాడే ఓ సబ్ స్టాండర్డ్ పదాన్ని పూరిని మెచ్చుకోవడం కోసం వాడిన రామ్ అందరికి షాక్ ఇచ్చాడు. అంటే కంటెంట్ ఏ రేంజ్ లో కనెక్ట్ అయ్యిందో అని అభిమానులు అంచనాలు పెంచేసుకున్నారు. ఎవరి సినిమా వారికి ముద్దు కాబట్టి దాని గురించి తర్వాత మాట్లాడుకోవచ్చు కానీ ఇప్పుడు ఇస్మార్ట్ భామలు సినిమా ప్రమోషన్ లో చాలా యాక్టివ్ గా ఉండటం మాస్ జనాన్ని లాగేలా ఉంది.

దిమాక్ ఖరాబ్ వీడియో సాంపుల్ ని ఇటీవలే విడుదల చేసిన సంగతి తెలిసిందే. అందులో నిధి అగర్వాల్ – నభా నటేష్ ఇద్దరూ రెచ్చిపోయి డాబాలో అందాలు ఆరబోయడం మాములుగా లేదు. ఇదిలా ఉంటె ప్రీ రిలీజ్ ఈవెంట్ లో బోనాలు ఎత్తడంతో పాటు ప్రమోషన్ల కోసం వెళ్లిన ప్రతి చోట ఈ ఇద్దరు బాగా హైలైట్ అయ్యేలా హంగామా చేయడం చూస్తుంటే చాలా రోజుల తర్వాత హీరోయిన్ల గ్లామర్ కోసం సినిమాకు వస్తారా జనం అనేలా ఇస్మార్ట్ శంకర్ మాస్ ని అట్రాక్ట్ చేస్తున్నాడనే కామెంట్స్ వినిపిస్తున్నాయి.

అప్పుడెప్పుడో పోకిరిలో ఇప్పటికింకా నా వయసు నిండా పదహారేతో రాష్ట్రాన్ని ఒక ఊపు ఊపేసిన పూరి మళ్ళీ మణిశర్మ నిధీ నభలతో ఆ స్థాయి మేజిక్ రిపీట్ చేశాడా 18న తేలిపోతుంది. ఇప్పటికే ఆడియో బాగానే మాస్ కి ఎక్కేసింది. పిక్చరైజేషన్ కూడా అదే స్థాయిలో ఉంటె రచ్చ మాములుగా ఉండదు. పోటీ ఉన్నప్పటికీ ఇస్మార్ట్ శంకర్ రిజల్ట్ గురించి చాలా ధీమాగా ఉన్నాడు. పూరికి ఖచ్చితంగా కొట్టాల్సిన తరుణంలో ఇస్మార్ట్ శంకర్ ఎంతమేరకు అంచనాలు నిలబెట్టుకుంటాడో వేచి చూడాలి
Please Read Disclaimer