అందరూ రిజెక్ట్ చేసిన హేమకు నో కంప్లైంట్స్!

0

వారం క్రితం బిగ్ బాస్ సీజన్ 3 స్టార్టింగ్ లో నటి హేమను ఇంట్లోకి పంపే వేళలో.. నాగార్జున ఆమె గురించి ఒక కాంప్లిమెంట్ ఇచ్చారు. బాగా వండుతారు కదా అన్న మాటకు.. ఇరగదీస్తానన్న రేంజ్లో రియాక్ట్ అయ్యారు. బిగ్ బాస్ హౌస్ మేట్స్ లో చాలామందికి వంట సరిగా రాని వేళ.. హేమ ఆ లోటు తీర్చటమే కాదు.. ఈ సీజన్ లో హేమ ఉన్నంత కాలం మంచి ఫుడ్ అందరికి దక్కుతుందన్న భావన కలిగించారు హేమ.

అంతవరకూ బాగానే ఉన్నా.. అనుకున్నట్లే ఇంట్లోకి ఎంట్రీ ఇవ్వటంతోనే వంటిల్లును సొంతం చేసుకోవటం వరకూ ఓకే. అక్కడి నుంచి డామినేట్ చేసిన తీరు హౌస్ మేట్స్ కు ఇబ్బందిగా మారింది. బిగ్ బాస్ ఇచ్చిన టాస్క్ లో పెద్ద మనిషిగా ఇంటి సభ్యులు ఎన్నుకున్నప్పటికి.. ఆ టాస్క్ పూర్తి అయ్యేసరికి హౌస్ మేట్స్ అందరూ కలిసి ఆమెను ఎలిమినేట్ చేస్తూ పంచ్ ఇవ్వటంతోనే.. హేమ తీరు ఇరిటేట్ చేసినట్లు ఫీల్ అవుతున్న వైనం అందరికి అర్థమైంది.

హౌస్ మేట్స్ తో పాటు.. బిగ్ బాస్ షో చూస్తున్న వారంతా హేమను ఎలిమినేషన్ వేటు వేయాలని తీర్పు ఇవ్వటంతో ఆమె ఇంట్లో నుంచి బయటకు వచ్చేశారు.

ఈ సందర్భంగా ఆమె తన గురించి.. తన డామినేషన్ గురించి వివరణ ఇచ్చే ప్రయత్నం చేశారు. తన జర్నీకి సంబంధించిన ప్రోమోను చూస్తూ ఎమోషన్ అయిన ఆమె.. వంటిల్లు వల్లే గొడవలు వచ్చాయని.. అది తప్ప తనపై ఎలాంటి కంప్లైంట్స్ లేవన్నారు. ఒక మదర్ ఫీలింగ్ తో ఉన్నానని.. అయితే ఎక్కువ పెట్టుకోవద్దు.. అది తీయొద్దు.. ఇది తీసుకోవద్దు అనటంతో తన నేచర్ డామినేట్ చేసేలా కనిపించిందని.. కమాండ్ చేసినట్లుగా హౌస్ మేట్స్ ఫీల్ అయ్యారని చెప్పింది.

ఇంటి సభ్యులంతా మంచివాళ్లేనని.. తాను చేసిందంతా వాళ్ల కోసమేనని.. అది కూడా వారికి అర్థం కానప్పుడు.. అక్కడ ఉండటం వేస్ట్ అనిపించినట్లు తెలిపింది. తన అంచనా ప్రకారం శ్రీముఖి.. బాబా భాస్కర్ ఆట చివరి వరకూ ఉండే అవకాశం ఉందన్న అంచనాను వ్యక్తం చేసింది. మొత్తానికి హేమ మదర్ హుడ్ అనుకుంటే.. ఇంటి సభ్యులు మాత్రం కమాండింగ్ అనుకోవటం గమనార్హం.
Please Read Disclaimer