బిగ్ బాస్ పై సంచలన వ్యాఖ్యలు చేసిన హేమ

0

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా చెప్పే బిగ్ బాస్ లో మరో వివాదం తెర మీదకు వచ్చింది. గడిచిన రెండు సీజన్లకు భిన్నంగా తాజాగా నడుస్తున్న సీజన్ త్రీలో బిగ్ బాస్ షో ప్రారంభం కావటానికి ముందే వివాదాలు తెర మీదకు రావటం తెలిసిందే. తొలి వారాంతంలో నటి హేమను ఎలిమినేట్ చేస్తూ నిర్ణయం తీసుకున్నారు. హౌస్ నుంచి బయటకు వచ్చిన హేమ.. నాగ్ తో మాట్లాడే సమయంలో అంతా బాగుందన్న ఆమె.. ఇప్పుడు అందుకు భిన్నమైన వ్యాఖ్యలు చేయటం సంచలనంగా మారింది.

మొత్తం 15 మంది హౌస్ మేట్స్ ఉండగా.. వారిలో ఆరుగురిని ఎలిమినేషన్ కోసం నామినేట్ చేయగా.. అందరి కంటే తక్కువ ఓట్లు వచ్చిన హేమను ఇంటి నుంచి బయటకు తీసుకొచ్చేశారు. వంటింట్లో డామినేషన్ చేసిన తీరును ఇంటి సభ్యులతో పాటు.. షోను చూస్తున్న వీక్షకులు సైతం హేమపై నెగిటివ్ ముద్ర పడింది. ఎలిమినేషన్ అయి నాగ్ తో మాట్లాడే సందర్భంలోనూ ఇంటి సభ్యుల గురించి పాజిటివ్ గా మాట్లాడారు.

షో నుంచి బయటకు వచ్చిన తర్వాత ఆమె మాట్లాడుతూ.. కావాలనే తనను షో నుంచి బయటకు పంపారని ఆరోపించారు. ఇంట్లో జరిగింది ఒకటైతే.. చూపించింది మరొకటన్న కొద్ద ఆరోపణ చేశారు. షోలో ఉన్నది ఉన్నట్లుగా చూపించలేదని.. ప్లాన్ వేసి మరీ తనను బయటకు పంపారన్నారు. అక్కా.. అక్కా.. అంటూనే తనపై లేనిపోని మాటలు చెప్పారని వాపోయారు.

హౌస్ లో గొడవ జరిగిన విధానానికి.. షోలో చూపించిన విధానానికి పొంతన లేదని వ్యాఖ్యానించారు. మొత్తంగా తనను బిగ్ బాస్ హౌస్ నుంచి బయటకు పంపేందుకు కుట్ర జరిగిందన్న రీతిలో హేమ చేస్తున్న ఆరోపణలు ఇప్పుడు మరో వివాదానికి తెర తీసినట్లే.
Please Read Disclaimer