జాన్వీ బ్యాలెన్సింగ్ ఫీట్

0

బాలీవుడ్ ఫిట్ నెస్ ఫ్రీక్స్ లో జాన్వీ పేరు ప్రముఖంగా వినిపిస్తుంటుంది. ఈ స్టార్ కిడ్ రెగ్యులర్ గా స్ట్రిక్ట్ ఫిట్ నెస్ గోల్స్ ని అనుసరిస్తుంటుంది. అది అందరిలో స్ఫూర్తిని నింపుతోంది. ప్రతిసారీ జిమ్ లో కసరత్తులు చేస్తూ నిరంతరం సోషల్ మీడియాలో కనిపిస్తూనే ఉంది. లేటెస్ట్ గా తన వ్యక్తిగత ట్రైనర్ నమ్రత పురోహిత్ ఓ స్నీక్ పీక్ ని సామాజిక మాధ్యమాల్లో షేర్ చేశారు.

అందులో `పైలెట్స్ పెర్ఫామ్` పేరుతో ప్రత్యేకమైన వర్కవుట్ ని షేర్ చేశారు. ఒకరినొకరు బ్యాలెన్సింగ్ చేస్తూ చేసే అరుదైన ఫీట్ ఇది. ఈ వర్కవుట్ ప్రత్యేకతను నమ్రత రివీల్ చేశారు. ఇందులో బాడీ ఫంక్షనల్ మూవ్ మెంట్స్ ఉంటాయి. బాడీ టోనింగ్ లో భాగంగా మజిల్స్ ని బలంగా చేసేందుకు ఈ తరహా సాధన ఉపయోగపడుతుంది. ఈ ఫోటోలో నమ్రత.. జాన్వీ భంగిమలు పరిశీలిస్తే .. ఒక చాపపై జిమ్నాస్టిక్ ఫీట్ లా కనిపిస్తోంది. జాన్వీ ఆరెంజ్ స్పోర్ట్ టాప్.. పింక్ జగ్గింగ్ ని ధరించగా… ట్రైనర్ నమ్రత బ్లూ స్పోర్ట్ టాప్.. బ్లాక్ జిమ్ లెగ్గింగ్ ని ధరించారు.

ప్రస్తుతం కెరీర్ పరంగానూ జాన్వీ క్షణం తీరిక లేకుండా ఉంది. ధడక్ తర్వాత `కార్గిల్ గర్ల్` షూటింగ్ పూర్తయింది. ఇందులో పైలెట్ గుంజన్ సక్సేనా పాత్రలో జాన్వీ నటిస్తోంది. అలాగే `రూహి అబ్జా` అనే మరో క్రేజీ చిత్రంలోనూ నటిస్తోంది. రాజ్ కుమార్ రావు- పంకజ్ త్రిపాఠి కాంబినేషన్ మూవీ ఇది. అలాగే కరణ్ జోహార్ హిస్టారికల్ మల్టీస్టారర్ మూవీ `తక్త్` లోనూ నటస్తోంది. విక్కీ కౌశల్ – రణవీర్ సింగ్ మధ్య కిరీటం కోసం పోరాటం నేపథ్యంలో ఆసక్తికర డ్రామాతో ఈ చిత్రం తెరకెక్కనుంది. ఇందులో ఆ ఇద్దరికీ సోదరి పాత్రలో కరీనా కపూర్ నటిస్తోంది. ఫిబ్రవరి 2020లో `తక్త్` రిలీజ్ కానుంది.
Please Read Disclaimer