శింబుకు జోడీగా హలో బ్యూటీ!

0

కళ్యాణి ప్రియదర్శన్ జోరు మామూలుగా లేదు. అఖిల్ చిత్రం ‘హలో’తో హీరోయిన్ గా ఎంట్రీ ఇచ్చిన కళ్యాణికి వెంటనే బ్రేక్ రాలేదు గానీ ఇప్పుడు స్లోగా బిజీ అవుతోంది. ఇప్పుడు సాయి తేజ్ ‘చిత్రలహరి’ లో ఒక హీరోయిన్ గా నటిస్తోంది. శర్వానంద్ -సుధీర్ వర్మ సినిమాలో కూడా కళ్యాణి ఒక హీరోయిన్. అంతే కాదు.. త్వరలో హీరోయిన్ గా కోలీవుడ్ ఎంట్రీ ఇచ్చేందుకు రెడీ అవుతోంది. ‘వాన్’ అనే చిత్రంలోనూ శివ కారికేయన్ చిత్రం ‘హీరో’ లోనూ నటిస్తోంది. ఈ సినిమాలు ఇంకా రిలీజ్ కాకమునుపే మరో ఛాన్స్ పట్టేసిందట.

తమిళ హీరో శింబు తాజాగా వెంకట్ ప్రభు దర్శకత్వంలో ‘మానాడు’ అనే చిత్రంలో నటించేందుకు రెడీ అవుతున్నాడట. ఇందులో శింబుకు జోడీగా కళ్యాణి ప్రియదర్శన్ ను ఎంపిక చేశారని సమాచారం. నిజానికి ఈ ‘మానాడు’ సినిమాను ప్రకటించి చాలా రోజులే అయింది. ఎంతకీ పట్టాలెక్కకపోవడంతో ప్రాజెక్ట్ ఇక లేదని అనుకున్నారు. కానీ తాజాగా ఈ చిత్ర నిర్మాత సురేష్ కామాక్షి ఈ సినిమాను త్వరలోనే సెట్స్ పైకి తీసుకెళ్తున్నామని ప్రకటించాడు. ప్రస్తుతం ఈ సినిమాకు ప్రీ ప్రొడక్షన్ కార్యక్రమాలు జోరుగా సాగుతున్నాయట.

కళ్యాణి ప్రియదర్శన్ తెలుగు తమిళం మాత్రమే కాకుండా తన మాతృభాష మలయాళంలో కూడా ఎంట్రీ ఇవ్వబోతోంది. ‘మరక్కార్: అరబికడలింటే సింహం’ అనే క్రేజీ ప్రాజెక్టులో కూడా నటిస్తోంది. ఈ చిత్రంలో మోహన్ లాల్.. సునీల్ శెట్టి..అర్జున్.. సుదీప్.. ప్రభు లాటి భారీ తారాగణం ఉంది. కళ్యాణి సినిమాల లైనప్ చూస్తుంటే త్వరలో సౌత్ మొత్తం మీద క్రేజీ హీరోయిన్ అయ్యేలా ఉంది.
Please Read Disclaimer