సినిమా టీవీల్లో కాస్టింగ్ కౌచ్ పై హీరోయిన్ సంచలన కామెంట్స్

0

కళ్యాణి.. తమిళంలో పలు చిత్రాల్లో నటించిన హీరోయిన్ గా పేరు సంపాదించుకుంది. 10 చిత్రాల్లో హీరోయిన్ గా నటించిన కళ్యాణి తర్వాత బుల్లితెరకు పరిచయమైంది. అక్కడి నుంచి సడన్ గా నిష్క్రమించింది. నటనకు దూరం కావడానికి కారణం ఏంటని తాజాగా హీరోయిన్ కళ్యాణిని అడగ్గా సంచలన నిజాలు చెప్పుకొచ్చింది. ప్రముఖ చిత్ర నిర్మాతల నుంచి ఫోన్లు వస్తున్నాయని.. కానీ తాను హీరోయిన్ గా చేయనని చెప్పానని అంది. దానికి కారణం ‘కాస్టింగ్ కౌచ్’ అని తెలిపింది.

హీరోయిన్ గా చాన్సులు వస్తుంటే మా అమ్మా చేయాలని అనేదని.. కానీ అడ్జెస్ట్ మెంట్ కమిట్ మెంట్స్ కు కమిట్ కావాలని నిర్మాతలు సినీ ప్రముఖులు అడగడం చూసి వద్దని అమ్మ చెప్పిందని హీరోయిన్ కళ్యాణి సంచలన వ్యాఖ్యలు చేశారు.

సినిమాలు వదిలి బుల్లితెరకు వచ్చినా ఆ కాస్టింగ్ కౌచ్ తప్పలేదని హీరోయిన్ కళ్యాణి తెలిపింది. ఒక టీవీ కార్యక్రమానికి వ్యాఖ్యాతగా చేస్తున్నప్పుడు ఆ టీవీ నిర్వాహకుడు రాత్రికి పబ్బుకు పిలిచాడని.. తాను రానని అంటే ఆ తరువాత ఆ టీవీలో ఏ కార్యక్రమంలోనూ తనకు అవకాశం రాలేదని కళ్యాణి నిజాలు చెప్పుకొచ్చింది. వాళ్లకు కమిట్ కాలేకే సినిమాలకు నటనకు దూరమైనట్టు నటి కళ్యాణి సంచలన విషయాలు వెల్లడించింది. అందుకే పెళ్లి చేసుకొని సెటిల్ అయ్యానని వివరించింది.
Please Read Disclaimer