బిగ్ బాస్ తెలుగులో బీజీపీ నాయకురాలు!

0

ఎన్నికల హడావుడి ముగిసింది. ఈ ఎన్నికలలో ఎంతోమంది ఫిలిం సెలబ్రిటీలు తమ అదృష్టాన్ని పరిక్షించుకున్నారు. అందులో పెద్ద పెద్ద స్టార్ల నుండి అవకాశాలు లేక ఫేడవుట్ అయిన నటీనటుల వరకూ చాలామంది ఉన్నారు. అదేంటో కానీ ఈసారి ఎక్కువమంది సినిమా సెలబ్రిటీలకు ఎన్నికల సమరంలో చుక్కెదురైంది. ఆ లిస్టులో మాజీ టాలీవుడ్ హీరోయిన్ మాధవిలత కూడా ఉన్నారు.

‘నచ్చావులే’.. ‘స్నేహితుడా’ లాంటి సినిమాలలో నటించి తెలుగు ప్రేక్షకులల్లో గుర్తింపు సాధించిన మాధవి కెరీర్ తర్వాత స్లో అయిపోయింది. ఎన్నికలకు కొంతకాలం ముందు బీజీపీలో చేరిన మాధవికి గుంటూరు వెస్ట్ అసెంబ్లీ నియోజకవర్గం టికెట్ లభించింది. టాలీవుడ్ సెలబ్రిటీ కావడంతో జనాల్లో గుర్తింపు ఉన్నప్పటికీ గెలుపుకు అది సరిపోలేదు. అయితే అసెంబ్లీ ఎన్నికలలో ఓటమి తర్వాత మాధవి లత మళ్ళీ ఎంటర్టైన్మెంట్ రంగం వైపు చూస్తోందట.

ఈమధ్యే మాధవికి తెలుగు బిగ్ బాస్ 3 లో పాల్గొనేందుకు నిర్వాహకుల నుండి ఆఫర్ వచ్చిందట. భారీ పాపులారిటీ ఉన్న ఈ రియాలిటీ షోలో పాల్గొంటే మళ్ళీ తన క్రేజ్ పెంచుకోవచ్చనే ఆలోచనలో మాధవి ఉందట. త్వరలోనే ఈ విషయంలో క్లారిటీ వచ్చే అవకాశం ఉంది.
Please Read Disclaimer