పాయల్ రాజ్ పుత్.. మెస్మరైజ్ చేస్తోందే

0

‘RX100’ లాంటి సూపర్ హిట్ సినిమాతో టాలీవుడ్ కు పరిచయం అయిన ముంబై బ్యూటీ పాయల్ రాజ్ పుత్. మొదటి సినిమాతోనే నటన విషయంలోనూ.. బోల్డ్ నెస్ విషయంలోనూ సూపర్ అని పేరు తెచ్చుకోవడంతో పాయల్ కు మంచి గుర్తింపే దక్కింది. అందుకే పాయల్ కు మంచి ఆఫర్లే వచ్చాయి. అంతటితో సంతృప్తి పడిపోతే ముంబై భామ ఎందుకు అవుతుంది? అందుకే క్రేజ్ ఇంకా పెంచుకునేందుకు హాట్ ఫోటో షూట్లు చేస్తూ.. ఆ ఫోటోలను సోషల్ మీడియా ఖాతాల ద్వారా పోస్ట్ చేస్తూ తన ఫాలోయింగ్ ను వీలైనంతగా పెంచుకుంటోంది.

సదరు గ్లామర్ ఉద్యమంలో భాగంగా మరోసారి రెచ్చిపోయి ఫోటో షూట్ చేసింది. ఆ ఫోటోలను తన ఇన్స్టా ఖాతా ద్వారా పోస్ట్ చేసింది. క్యాప్షన్ ఏమీ ఇవ్వలేదు కానీ మూడు లవ్ ఎమోజిలను పెట్టింది. ఈ ఫోటోలో క్రీమ్ కలర్ ఛోళి.. ప్రింటెడ్ కలర్స్ ఉంటె లెహెంగా ధరించి సెన్సువల్ గా నవ్వుతూ పోజిచ్చింది. యాక్సెసరీస్ ఏవీ ధరించలేదు కానీ ఇయర్ రింగ్స్ మాత్రం పెద్దవి పెట్టుకుంది. హ్యాంగింగ్ ఇయర్ రింగ్స్ కావడంతో.. వాటిని సడెన్ గా చూస్తే తలలో పూలు పెట్టుకున్నట్టుగా అనిపిస్తుంది. అంతా బాగానే ఉంది కానీ ఈ ఫోటోలో హైలైట్ మాత్రం ఆమె నాభి అందాల పక్కనే ఉన్న చిన్న పుట్టుమచ్చ. ఫుల్ రొమాంటిక్ గా కనిపిస్తోంది. మరో ఫోటోలో గోడకు ఆనుకుని నిలబడి కళ్ళు మూసుకొని ఘాటుగా ఒక సెక్సీ పోజిచ్చింది.

ఈ ఫోటోలకు నెటిజన్ల నుండి రెస్పాన్స్ అదిరిపోయింది. “ఏ మోల్ హై అన్ మోల్”.. “స్టన్నింగ్ బ్యూటీ.. సెక్సీ మోల్”.. “అమేజింగ్ & బ్యూటిఫుల్ పాయల్” అంటూ కామెంట్లు పెట్టారు. ఒక నెటిజన్ మాత్రం “ఆ మచ్చ నిజమా లేక ఊరికే స్టిక్కర్ పెట్టుకున్నావా?” అంటూ అనుమానం వ్యక్తం చేశాడు. పాయల్ సినిమాల విషయానికి వస్తే.. ప్రస్తుతం ‘వెంకీ మామ’ లో నటిస్తోంది. తమిళంలో ‘ఏంజెల్’ అనే చిత్రంలో పంజాబీలో ‘హాన్జీ హాన్జీ’ అనే సినిమాలో కూడా నటిస్తోంది. తెలుగులో మరో రెండు సినిమాలు కూడా లైన్లో ఉన్నాయట.
Please Read Disclaimer