నటి భర్త వివాహేతర సంబంధం

0

కొత్త చట్టలు ఎన్ని వచ్చినా వరకట్న వేధింపులు మాత్రం అదుపు లోకి రాలేదు. ఇలాంటి వివాదాలకు టీవీ నటులు..సినిమా వాళ్లేమీ అతీతులు కారు. టాలీవుడ్ సహా కోలీవుడ్ లోనూ ఇలాంటి వివాదాలెన్నో తెరపైకొచ్చాయి. ఇలాంటి వివాదాల్లో బుల్లితెర నటీనటుల పేర్లు ఎక్కువ ప్రచారంలోకి వచ్చాయి. తాజాగా అదనపు కట్నం కావాలంటూ భర్త వేధిస్తున్నాడని తమిళ నటి రమ్య బెంగుళూరు కొడిగే హల్లి పోలీసులకు ఫిర్యాదు చేసిన విషయం వెలుగు లోకి వచ్చింది.

2017లో కొరియోగ్రాఫర్ వరదరాజన్ తో రమ్యకు వివాహం అయింది. పెళ్లి సమయంలో కట్నంగా ఇంటి స్థలం తో పాటు.. బంగారు ఆభరణాలు నగదు ఇచ్చారు. అయితే వరదరాజన్ డ్యాన్స్ అకాడమీ స్థాపించాలని అందుకు అదనంగా డబ్బులు కావాలని రమ్య పై వేధింపులకు దిగాడుట. దీంతో రమ్య పోలీసులను ఆశ్రయించింది. భర్త ప్రవర్తన ఒత్తిడి పై ఫిర్యాదు చేసింది. అలాగే వరదాజన్ మరో మహిళతో వివాహేతర సంబంధం పెట్టుకుని వేధిస్తున్నాడని ఫిర్యాదులో పేర్కొంది.

నటి రమ్య కోలీవుడ్ లో కొన్ని సినిమాల్లో కూడా నటించింది. రమ్య ఫిర్యాదును స్వీకరించిన పోలీసులు వివిధ సెక్షన్ల కింద కేసులు నమోదు చేసి విచారణ చేపడుతున్నారు. రమ్య ఆరోపణల్లో నిజం ఉందని తేలితే వరదరాజన్ కు కఠినం గా శిక్ష పడుతుందని పోలీసులు తెలిపారు. ఇక టాలీవుడ్ లో పలువురు బుల్లి తెర నటులు గతంలో ఇలాంటి వివాదాలతో వెలుగులోకి వచ్చిన సంగతి తెలిసిందే. ఓ ప్రముఖ కమెడియన్ వివాహేతర సంబంధం అనంతరం కుటుంబ తగాదాలు ఆత్మహత్య అప్పట్లో సంచలనమైన సంగతి తెలిసిందే.
Please Read Disclaimer