హాట్ బ్యూటీ బ్యాక్ టు ఫామ్

0

రెజినా కసాండ్రా ‘కందనాల్ ముదల్’ అనే తమిళ చిత్రంతో 2005 లోనే వెండితెరకు పరిచయం అయింది. అయితే మొదటి తెలుగు సినిమా మాత్రం 2012 లో చేసింది. కెరీర్ ఆరంభంలో కాస్త చెప్పుకోదగ్గ సినిమాల్లో నటించింది కానీ ఈమధ్య మాత్రం టాలీవుడ్ లో జోరు తగ్గింది. రెజీనాకు తమిళంలో ఇప్పటికీ ఆఫర్లు ఉన్నాయి. కానీ తెలుగులో దాదాపుగా ఫేడ్ అవుట్ అయిపోయిందనే టాక్ వినిపించింది. ఇలాంటి పరిస్థితుల్లో రిలీజ్ అయిన ‘ఎవరు’ విజయం ఒక్కసారిగా రెజీనాకు మంచి బూస్ట్ ఇచ్చింది.

అడివి శేష్ హీరోగా వెంకట్ రాంజీ దర్శకత్వంలో తెరకెక్కిన ‘ఎవరు’ కు మంచి టాక్ దక్కడమే కాదు.. ఈ సినిమాలో రెజీనా నటనపై ప్రశంసల వర్షం కురుస్తోంది. దీంతో సినిమాకు మరింతగా బజ్ పెంచేందుకు జోరుగా ‘ఎవరు’ ప్రమోషన్స్ లో పాల్గొంటోంది. తాజాగా ‘ఎవరు’ ప్రమోషన్ లో భాగంగా ఒక ప్రెస్ మీట్ కు హాజరైంది. ఆ ప్రెస్ మీట్ కు ముందుగా ఒక ఫోటో షూట్ లో పాల్గొంది. ఆ ఫోటోలలో వీలైనంతగా గ్లామర్ ఒలికిస్తూ అందరినీ ఆకట్టుకుంది. గ్రీన్.. పింక్ కాంబినేషన్ లో ఉన్న ప్యాంట్ సూట్ ధరించింది. ఒక చేతికి ఫుల్ స్లీవ్ మరో చేతికి స్లీవ్ లెస్ గా కొంచెం వెరైటీగా కనిపిస్తోంది. అయితే క్లీవేజ్ అందాలను ఫుల్ గా ధారపోయడంతో ఫోటో యమా హాట్ గా మారిపోయింది. బుగ్గ మీద చెయ్యి పెట్టుకొని ఒక స్మైల్ కూడా ఇచ్చింది.

‘ఎవరు’ విజయం తో ఫుల్ గా రీఛార్జ్ అయింది కాబట్టి టాలీవుడ్ లో రెజీనా కు మరోసారి మంచి అవకాశాలు రావడం ఖాయమే. ఇక రెజినా ఫ్యూచర్ ప్రాజెక్టుల విషయానికి వస్తే తమిళంలో ‘కల్లాపార్ట్’.. ‘కసడ తపర’ అనే చిత్రాల్లో నటిస్తోంది.
Please Read Disclaimer