మహేష్ 26లో ఇంకో కంబ్యాక్..!

0

17 ఏళ్ళ క్రితం వచ్చిన కృష్ణవంశీ ఖడ్గంలో ఒక్క ఛాన్స్ అంటూ ప్రేక్షకుల గుండె మెలితిప్పిన హీరోయిన్ సంగీత గుర్తుందిగా. ఆ తర్వాత ఈ అబ్బాయి చాలా మంచోడు-పెళ్ళాం ఊరెళితే – బహుమతి లాంటి కొన్ని సినిమాలు చేసింది కానీ ఎక్కువ కాలం ఇండస్ట్రీలో మాత్రం లేరు. తర్వాత పెళ్లి చేసుకుని వ్యక్తిగత జీవితం కోసం గ్యాప్ తీసుకుని మళ్ళీ ఇన్నాళ్లకు ఈవిడ తెరపై దర్శనమివ్వనున్నారు. మహేష్ బాబు హీరోగా అనిల్ రావిపూడి రూపొందిస్తున్న సరిలేరు నీకెవ్వరూలో సంగీత ఓ కీలక పాత్ర చేస్తున్నారు.

రష్మిక మందన్నతో సినిమాలో ట్రావెల్ చేసే ఈ రోల్ కథలో మలుపులు కారణం అవుతుందట. తల్లిగానా లేక అసిస్టెంట్ గానా అనే క్లారిటీ ఇంకా రాలేదు. హైదరాబాద్ తో పాటు కర్నూల్ షెడ్యూల్ లో ఆవిడ పాల్గొంటారని సమాచారం. సో ఇద్దరు సీనియర్ ఆర్టిస్టులకు సరిలేరు నీకెవ్వరూ కంబ్యాక్ మూవీ కాబోతోంది. ఒకరు విజయశాంతి కాగా మరొకరు సంగీత.

ఇప్పటికీ విజయశాంతి పాత్ర తాలూకు లీక్స్ బయటికి రాకుండా జాగ్రత్త పడుతున్న టీమ్ త్వరలో ఆవిడ పార్ట్ ని షూట్ చేయబోతున్నారు. మహేష్ తో ఆవిడ కాంబో సీన్స్ ఓ రేంజ్ లో ఉంటాయట. సంగీత పాత్రకు ఎంత ప్రాధాన్యం ఉంటుందన్న క్లారిటీ మాత్రం ఇంకా రాలేదు. రాజేంద్ర ప్రసాద్ – ప్రకాష్ రాజ్ తదితరులు కీలక పాత్రలు పోషిస్తున్న సరిలేరు నీకెవ్వరూ వచ్చే సంక్రాంతికి విడుదల కానుంది
Please Read Disclaimer