న్యూ ఇయర్ పార్టీ లో నలిగి పోయిన హీరోయిన్

0

న్యూ ఇయర్ పార్టీలు అంటూ చిన్న హీరోయిన్స్ నుండి స్టార్ హీరోయిన్స్ వరకు అంతా కూడా ఫుల్ బిజీగా గడుపుతారు. చాలా మంది హీరోయిన్స్ పారితోషికం కోసం పార్టీల్లో గెస్ట్ అప్పియరెన్స్ ఇస్తూ ఉంటారు. నిన్న ఖమ్మంలో జరిగిన న్యూ ఇయర్ పార్టీలో హీరోయిన్ శ్రద్దా దాస్ పాల్గొంది. నిర్వాహకులు శ్రద్దా దాస్ ను న్యూ ఇయర్ పార్టీ కోసం తీసుకు వెళ్లారట. అక్కడ సరైన ఏర్పాట్లు చేయక పోవడం తో శ్రద్దా దాస్ తీవ్రంగా ఇబ్బంది పడ్డట్లు గా తెలుస్తోంది.

సాదారణం గా ఒక సెలబ్రెటీ వస్తుంది అంటే జనాలు భారీగా వస్తారు. అలాంటిది ఒక హీరోయిన్ అది కూడా న్యూ ఇయర్ పార్టీ అవ్వడంతో జనాలు నిర్వాహకులు ఊహించని విధంగా వచ్చారట. ఆ జనాల్లో శ్రద్దాను కాపాడేందుకు బౌన్సర్ లు కూడా లేకపోవడంతో నిర్వహకులు ఆమెను కాపాడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందట. పార్టీ వేదిక వద్దకు చాలా మంది రావడం తో పాటు ఆమెతో సెల్ఫీ లు తీసుకునేందుకు.. ఆమెతో షేక్ హ్యాండ్ ఇచ్చేందుకు పోటీ పడ్డారు.

శ్రద్దా దాస్ అక్కడ నుండి బయట పడేందుకు చాలా కష్టపడాల్సి వచ్చిందట. చివరకు ఏదోలా బయట పడి స్టేజ్ మీద కు చేరుకుని కొంత సమయం పాటు డాన్స్ లు చేసింది. ఖమ్మం జనాలను తన డాన్స్ లతో అలరించి కొత్త సంవత్సరం వేడుకలను ఉత్సహవంతంగా మార్చింది. ఖమ్మం వారిని ఆనంద పర్చినా కూడా ఆమె మాత్రం జనాల అత్యుత్సాహం వల్ల ఇబ్బంది పడాల్సి వచ్చింది. పాత సంవత్సరంకు ఒక చేదు అనుభవంతో శ్రద్దా దాస్ ముగించిందన్నమాట.
Please Read Disclaimer