శ్రీ రెడ్డి ఆడి కారు ను అలా చెడగొట్టేశారట

0

వివాదాలకు కేరాఫ్ అడ్రస్ గా నిలుస్తూ.. తరచూ వార్తల్లోకి నటి శ్రీరెడ్డి. మీటూ పేరుతో టాలీవుడ్ లో రచ్చ చేసిన ఆమె.. కోలీవుడ్ కు వెళ్లి అక్కడి ప్రముఖుల మీదా విరుచుకు పడిన వైనం తో అక్కడా సంచలనంగా మారారు. హైదరాబాద్ నుంచి చెన్నైకి షిఫ్ట్ అయిన ఆమె.. ఫేస్ బుక్ తో పాటు ఇతర సోషల్ మీడియా ఫ్లాట్ ఫాంతో ఆమె చెప్పాలనుకున్న విషయాల్ని.. తెర మీదకు తీసుకురావాల్సిన సంచలనాల్ని తీసుకొస్తుంటారు.

ప్రస్తుతం ఆమె చెన్నైలోని కోయంబేడు పోలీస్ స్టేషన్ పరిధిలోని అన్భనగర్ లోని ఒక ప్లాట్ లో ఉంటున్నారు. అయితే.. ఆమె ఇంటి ముందు ఒక వెబ్ సిరీస్ కుసంబంధించిన షూటింగ్ జరుగుతోందట. ఈ యూనిట్ చేస్తున్న గోలకు తాను ఇబ్బంది పడుతున్నట్లు వాపోతుంది.

షూటింగ్ కారణం గా పలు కార్లు రోడ్ల మీద ఆపుతున్నారని.. తన ఇంటి సమీపంలో వాహనం ఒకటి ఆపి ఉండటంతో తాను దాన్ని పక్కకు తీయించానని.. ఆ తర్వాత తన ఖరీదైన ఆడి కారుకు గీతలు గీసి ధ్వంసం చేశారని చెబుతోంది. ఈ ఉదంతం మీద తాను పోలీసులకు కంప్లైంట్ ఇచ్చినట్లు గా పేర్కొంది. షూటింగ్ చేస్తున్న చిత్ర నిర్వాహకుడు మనోజ్ మీద తనకు అనుమానం ఉందని.. అతని పైనా.. అతని మనుషుల పైనా చర్యలు తీసుకోవాలని కోరుతోంది. అదేందో.. శ్రీరెడ్డి ఎక్కడుంటే అక్కడ ఇష్యూలు ఉంటాయా? లేక.. ఇష్యూలు ఆమెనే వెతుక్కుంటూ వస్తాయా? అన్నదిప్పుడు క్వశ్చన్ గా మారిందని చెప్పాలి.
Please Read Disclaimer