కరోనాకు మందు చెప్పిన శ్రీరెడ్డి

0

కొందరు వ్యక్తులు సోషల్ మీడియాలో ప్రచారం కోసం.. ఇంకా తాము ఎప్పుడు కూడా ట్రెండ్ అవుతూ ఉండాలనే ఉద్దేశ్యంతో సోషల్ మీడియాలో ట్రెండ్ అవుతున్న విషయాల గురించి స్పందిస్తూ హాట్ కామెంట్స్ చేస్తూ అందరి కంటే విభిన్నంగా మాట్లాడుతూ ఉంటారు. ఆ కోవకు చెందిన వారిలో శ్రీరెడ్డి ఒకరు అనడంలో ఎలాంటి సందేహం లేదు. సోషల్ మీడియాలో రామ్ గోపాల్ వర్మ తర్వాత శ్రీరెడ్డి కూడా చాలా ఎక్కువగా జనాలను ఆకర్షిస్తూ వివాదాస్పద పోస్ట్ లు పెడుతూ ఉంటుంది.

తెలుగు.. తమిళ సినిమా పరిశ్రమలకు చెందిన ప్రముఖులపై ఇప్పటి వరకు పోస్ట్ లు పెడుతూ వచ్చిన శ్రీరెడ్డి తాజాగా కరోనా గురించి చాలా యాక్టివ్ గా ఫేస్ బుక్ లో పోస్ట్ లు పెడుతూ వస్తోంది. ఆ మద్య ఎవరో సోషల్ మీడియాలో కంటిన్యూస్ సెక్స్ ఈజ్ మెడిషన్ ఫర్ కరోనా అంటూ పోస్ట్ చేశారు. అది కాస్త వైరల్ అవ్వడం తో శ్రీరెడ్డి కూడా ఆ విషయాన్ని తన ఫేస్ బుక్ వాల్ పై పోస్ట్ చేసింది.

ప్రయోగాత్మకంగా నిరూపితం అయిన ఈ విషయాన్ని మీరు కూడా పాటించండి అంటూ చెప్పుకొచ్చింది. నిరంతరాయంగా సెక్స్ చేయడం వల్ల కరోనా వైరస్ దరికి రాదని.. ఉన్నా పోతుందనే అర్థం వచ్చేలా శ్రీరెడ్డి పోస్ట్లు పెట్టింది. మొత్తానికి శ్రీరెడ్డి మరోసారి ఈ పోస్ట్ తో అందరి దృష్టిని ఆకర్షించింది. ఇలాంటి సమయంలో ఇలాంటి పోస్ట్ లు పెట్టడం పై శ్రీరెడ్డి ని సోషల్ మీడియా లో పలువురు తీవ్ర స్థాయిలో దుమ్మెత్తి పోస్తున్నారు.
Please Read Disclaimer