బర్నింగ్ స్టార్ తో చేస్తే అంతే అన్నారట!

0

బర్నింగ్ స్టార్ సంపూర్ణేష్ బాబు పేరు తెలియని తెలుగు ప్రేక్షకులు దాదాపుగా ఉండరు. అయితే ఆయన ఎంత పెద్ద బర్నింగ్ స్టార్ అయినా ఆయనను ఇంకా చాలామంది హీరోగా గుర్తించరు. అందుకేనేమో మరి ఒక నటికి సంపూ సినిమాలో నటించవద్దని జనాలు సలహాలు ఇచ్చారట. ఇంతకీ ఆ నటి ఎవరంటే తెలుగులో చాలా సినిమాలలో సపోర్టింగ్ రోల్స్ చేసిన నటి సుధ.

ఆమెకు పెద్దగా గుర్తింపు లేదు కానీ ‘కొబ్బరి మట్ట’ సినిమాలో ఒక హీరోయిన్ గా అవకాశం వచ్చిందట. అయితే తన ఫ్రెండ్స్.. సన్నిహితులు సంపూ సినిమాలో నటించవద్దని సూచించారట. సంపూ సినిమాలో నటిస్తే ఇక వేరే సినిమాల్లో అవకాశాలు రావేమోనని భయపెట్టారట. అయితే ఇప్పటివరకూ నటించిన సినిమాల్లో చెప్పుకోదగ్గ పాత్రలేవీ రాలేదని.. అలాంటప్పుడు సంపూ సినిమాలో నటిస్తే ఏమౌతుంది అనే ఉద్దేశంతో ‘కొబ్బరి మట్ట’ టీమ్ ను సంప్రదించిందట. కానీ అప్పటికే ఆ హీరోయిన్ రోల్ కు వేరే నటిని తీసుకున్నారట. కానీ ఫ్లాష్ బ్యాక్ లో సంపూ భార్యలలో ఒకరి పాత్ర మాత్రమే ఉందట. అందుకే ఆ పాత్రను యాక్సెప్ట్ చేశానని తెలిపింది సుధ.

కొబ్బరి మట్ట’ ఫ్లాష్ బ్యాక్ ఎపిసోడ్ లో సంపూకు ఆరుగురు భార్యలు ఉంటారట. వారిలో ఒకరిగా సుధ నటిస్తోంది. అయినా సినిమాలో కంటెంట్ ఉండాలి కానీ ఏ సినిమాలో నటించినా పేరు వస్తుంది. అలా కాకుండా సినిమాలో స్టఫ్ లేకుండా ఎంత పెద్ద హీరో సినిమాలో నటించినా ఏం ఉపయోగం ఉండదు. మరి ఈ ‘కొబ్బరిమట్ట’ లో ప్రేక్షకులను మెప్పించే కంటెంట్ ఉందా లేదా అనేది త్వరలోనే తెలుస్తుంది.
Please Read Disclaimer